Jagan Wishes To Modi: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందు ఇంటిని చక్కదిద్దుకుని తరువాత బయటకు వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఇలాగే ఉంది. తన తల్లి పుట్టిన రోజుకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో అప్పుడే ఎన్నో విమర్శలు వచ్చాయి. తల్లి, చెల్లిని ప్రేమించలేనివాడు లోకాన్ని ఏం ప్రేమిస్తాడనే వాదనలు కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యులను సరిగా పట్టించుకోకపోవడంతో వారు విడిగా ఉంటున్నట్లు సమాచారం.

జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన షర్మిలను కూడా చిన్నచూపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ సానుభూతితో గెలవాలని చూస్తోంది. ఏపీ మంత్రి వర్గంలో కనీసం ఓ మంత్రి పదవికూడా ఇవ్వకపోవడంతోనే ఆమె వేరు కుంపటి పెట్టినట్లు ఇదివరకే ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం జగన్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే పలు సందర్భాల్లో పేర్కొనడం గమనార్హం. దీంతోనే ఆమె వైఎస్సార్ టీపీ పెట్టుకుని తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతోంది.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు కావడంతో అందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ కూడా ఉదయాన్ని మోడీకి శుభాభివందనలు తెలపడంపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. కూట్లో రాయి ఏరనోడు ఏట్లో రాయి ఏరినట్లు కన్న తల్లికి మాత్రం విషెష్ చెప్పని జగన్ ప్రధాని మోడీకి చెప్పడంతో పలువురు ప్రశ్నిస్తున్నారు. కన్నవారిని పట్టించుకోని జగన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై ఉన్న కేసులు కేంద్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నందునే జగన్ మోడీకి దగ్గరవ్వాలని చూస్తున్నారని చెబుతున్నారు.
భవిష్యత్ లో కూడా తన మనుగడకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే బీజేపీతో సఖ్యతగా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం జగన్ లో వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఉదయాన్నే ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు అని చెబుతూ ట్వీట్ చేయడంతో అందరు అవాక్కయ్యారు. తన రక్షణ కోసం జగన్ ఇలా చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తల్లిని ప్రేమించలేని వ్యక్తి ప్రధానిని మాత్రం ప్రేమిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మొత్తానికి జగన్ తీరు పలు ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

జగన్ పై అక్రమాస్తుల కేసులతో పాటు పలు కేసులు పెండింగులో ఉన్నాయి. దీంతో ఆయన అధికారానికంటే ముందే కొద్ది రోజులు జైలుకు వెళ్లొచ్చారు. ఆ సమయంలో షర్మిల పాదయాత్ర కొనసాగించి అన్న గెలుపునకు బాటలు వేసింది. అయినా జగన్ మాత్రం తల్లి, చెల్లికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వారికి ఆగ్రహం పెరిగింది. సొంతంగా పార్టీ పెట్టుకునే వరకు వెళ్లింది. షర్మిల సొంత పార్టీ పెట్టుకోవడం జగన్ కు మాత్రం ఇష్టం లేకున్నా షర్మిల మాత్రం వినకుండా సొంతంగా పార్టీని స్థాపించి ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో జగన్ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.