Janhvi Kapoor- Prabhas: అతిలోక సుందరి శ్రీదేవి లాగే ఆమె పెద్ద కూతురు ‘జాన్వీ కపూర్’ మంచి అందగత్తె. ఆ మాటకొస్తే కొన్ని యాంగిల్స్ లో శ్రీదేవి కూడా సరిపోదు. తాజాగా ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో బోలెడు సంగతులు చెప్పుకొచ్చింది. ఇంతకీ.. జాన్వీ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ సంగతులు అమ్మడు మాటల్లోనే విందాం. నాకు ప్రభాస్ అంటే అభిమానం. అందుకే నాకు ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే బాగుండు. అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. ఇంతకీ ఉన్నట్టు ఉండి జాన్వీ పాప ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చింది అంటే.

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఒక హీరోయిన్ గా బాగా యంగ్ బ్యూటీ కావాలట. పాత్ర కూడా అలాగే ఉంటుందట. అందుకే, ఈ పాత్రలో జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ లో రూమర్లు వినిపించాయి. ఐతే, ఈ ప్రచారంపై తాజాగా జాన్వీ స్పందిస్తూ.. పై విధంగా మాట్లాడింది. అలాగే జాన్వీ కపూర్ ఎమోషన్ అంటే ఇష్టం అంటోంది. ఎమోషనల్ సీన్స్ లో నటించడం తనకు ఫేవరేట్ అంటుంది.
నిజానికి ఎమోషన్ ను పండించడం చాలా కష్టం. ఎమోషన్ టైమింగ్ ఎదురుగా ఉన్న యాక్టర్ రియాక్షన్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే.. జాన్వీ కపూర్ ఎమోషనల్ సీన్స్ లో ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ తో సన్నిహితంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది. అలాగే, ఎమోషన్ తర్వాత జాన్వీకి రొమాన్స్ కూడా ఇష్టమేనట. కారణం.. రొమాన్స్ ను పడించడం తనకు చాలా తేలికైన పని అంటుంది.

అందుకే.. హీరోలతో రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు జాన్వీ కపూర్ చాలా ఉత్సాహంగా ఉంటుందట. మొత్తానికి తన దృష్టిలో రొమాన్స్ చాలా ఈజీ అని తేల్చి చెప్పింది జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ కపూర్ చేస్తున్న సినిమాలో రొమాన్స్ ఎక్కువగానే ఉంటుందట. రొమాన్స్ చేయడాన్ని ఆమె ప్రజెంట్ బాగా ఎంజాయ్ చేస్తోందట. మొత్తానికి నటనలో తనకు ఇష్టమైన ఎలిమెంట్ ను మొహమాటం లేకుండా బయటకు చెప్పేసింది జాన్వీ కపూర్.
ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాతో పాటు బవాల్ అనే సినిమాలో నటిస్తోంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో జాన్వీ కపూర్ ది పక్కా కామెడీ రోల్. ఐతే.. బవాల్ సినిమాలో మాత్రం జాన్వీ కపూర్ ఫుల్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతుందట. తన కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ రోల్స్ రావడం తనకు ఆనందంగా ఉందంటోంది.