CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు

CM Jagan Election 2024:  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీ వ్యవహారాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి దాకా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేయలేదు. కేవలం ప్రభుత్వ నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించిన సీఎం ఇప్పుడు మాత్రం పార్టీ వ్యవహారాలపై పట్టు బిగించాలని చూస్తున్నారు. ఇన్నాళ్లు ఏదో అని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుతం పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజల్లో […]

Written By: Srinivas, Updated On : March 19, 2022 9:21 am
Follow us on

CM Jagan Election 2024:  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీ వ్యవహారాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి దాకా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేయలేదు. కేవలం ప్రభుత్వ నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించిన సీఎం ఇప్పుడు మాత్రం పార్టీ వ్యవహారాలపై పట్టు బిగించాలని చూస్తున్నారు. ఇన్నాళ్లు ఏదో అని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుతం పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా కదలాలని పిలుపునిస్తున్నారు.

CM Jagan

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉండటంతో పార్టీ నేతలను అందుకు సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఇంటింటికీ వైసీపీని చేర్చాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఎక్కడైనా సరే ప్రజలతో కలిసి వారి సాదకబాదకాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో నేతలు నిర్లక్ష్యం వీడాలని చెబుతున్నారు.

Also Read: Taxes in AP: ఏపీ ప్రజల ‘పన్ను’ పీకేందుకు రెడీ అవుతున్న జగన్?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే పార్టీ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో సైతం ఆయన సారధ్యంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సారి కూడా ఆయన సూచనలతోనే పార్టీ కార్యక్రమాలు ముందుకు వెళ్లనున్నాయి. అందుకే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ పదేపదే చెబుతున్నారు. ప్రజాబలంతోనే అధికారం సాధ్యమని నమ్ముతున్నారు. దాని కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల ఎజెండా వైసీపీని ఓడించడమే. అందుకే దీని కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేయడంతో విజయం సులువైంది. కానీ ఈసారి అలా కాదు విజయం అంత తేలిక కాదని తెలిసిపోతోంది. అందుకే పార్టీ నేతలు దేనికైనా రెడీగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు

CM YS Jagan

అధికారమనే పరమపద సోపానంలో సేద తీరాలంటే కష్టపడాలి. అందు కోసం మార్గాలు అన్వేషించాలి. ప్రత్యర్థుల ఆలోచనలను పసిగట్టాలి. వారిని ఢీకొనే సామర్థ్యం పెంచుకోవాలి. ఇందుకు గాను సర్వశక్తులు ఒడ్డాలి. సమరంలో విజయం సాధించేందుకు కావాల్సిన శక్తులను ఏకం చేసుకోవాలని జగన్ తాపత్రయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే పరమార్థంగా తమ పనులు చేసుకోవాలని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Aam Admi in Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు షాకిస్తూ ఆమ్ ఆద్మీ రె‘ఢీ’

Tags