సీఎం జగన్ ‘ప్రత్యేక హోదా’ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి జగన్ పాత పాటే పాడారు. ఎన్నికల ముందు 20 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ఆయన 22 సీట్లు ఇచ్చినా హోదా విషయం గురించి కొంతకాలంగా మాట్లాడం లేదు. ప్రస్తుతం హోదా గురించి మాట్లాడక పోవడమే మంచిదంటూ తన మనసులో మాట తాజాగా బయట పెట్టారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో పరిశ్రమ ఏర్పాటు […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 6:23 pm
Follow us on


రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి జగన్ పాత పాటే పాడారు. ఎన్నికల ముందు 20 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ఆయన 22 సీట్లు ఇచ్చినా హోదా విషయం గురించి కొంతకాలంగా మాట్లాడం లేదు. ప్రస్తుతం హోదా గురించి మాట్లాడక పోవడమే మంచిదంటూ తన మనసులో మాట తాజాగా బయట పెట్టారు.

మన పాలన – మీ సూచన కార్యక్రమంలో పరిశ్రమ ఏర్పాటు అంశంపై ప్రసంగిస్తూ ఆయన ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభించేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని, 175 శాసనసభ స్థానాలకు 151, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు 23 సీట్లు ఇచ్చారన్నారు. జాతీయ స్థాయిలో 4వ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉన్నదని తెలిపారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వాటి కంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ వచ్చాయని దీంతో ఆ పార్టీకి వైసీపీ మద్దతు అవసరం లేకుండా పోయిందన్నారు.

ప్రస్తుతం ప్రత్యేక హోదా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. బీజేపీకి సీట్లు తక్కువగా వస్తే హోదా అడిగేందుకు అవకాశం ఉండేదన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కొత్తలో ఇదే విధంగా మాట్లాడారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ టీడీపీ ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని విమర్శించారు.