https://oktelugu.com/

జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ జోస్యం..!

గత కొంతకాలంగా రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటూ వస్తున్న సినీ నటుడు, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ నేడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న టిడిపి మహానాడులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండదని, త్వరలోనే టిడిపి అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పడక వేసిన్నట్లు ధ్వజమెత్తుతూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 28, 2020 5:33 pm
    Follow us on


    గత కొంతకాలంగా రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటూ వస్తున్న సినీ నటుడు, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ నేడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

    ప్రస్తుతం జరుగుతున్న టిడిపి మహానాడులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండదని, త్వరలోనే టిడిపి అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో పరిపాలన పడక వేసిన్నట్లు ధ్వజమెత్తుతూ ఎక్కడ చూసినా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగన్ వైఖరిలో మార్పు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు.

    వైసిపి ఒక్కసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

    రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. టిడిపి నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు.

    రాష్ట్రంలో అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంటూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని టిడిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

    టిడిపికి బలం పార్టీ కార్యకర్తలే అని అంటూ వారే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులకు గురికావలసి వచ్చినా పార్టీని కాపాడుకొంటూ వస్తున్నారని కొనియాడారు. ఎన్‌టిఆర్‌ వారసులం తాము కాదని, కార్తకర్తలే నిజమైన వారసులని స్పష్టం చేశారు.

    కష్ట కాలంలో పార్టీకి సమర్ధవంతమైన నాయకత్వం అందిస్తున్నారని అంటూ పార్టీ అధినేత, తన బావమరిది చంద్రబాబు నాయుడును కొనియాడారు. ఎన్‌టిఆర్‌ కలలను చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారని ప్రశంసించారు.