వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి రోజురోజుకు దూరం అవుతున్నారా..? ఇటీవలి కాలంలో ఆయనపై ఇంటలిజెన్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టిందని కథనాలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నా పెద్దిరెడ్డికి పెద్దగా సమాచారం ఇవ్వడం లేదట. సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయనకు చెందిన శాఖకు సంబంధించిన నిర్ణయాలను ముఖ్యమంత్రి సలహాదారులే తీసుకుంటున్నారు.
Also Read: పవన్ సంచలనం: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ!
మరోవైపు ఇసుక పాలసీ విషయంలో తీవ్రమైన విమర్శలు రావడంతో పాటు.. ఏపీ సర్కార్ పెద్దలు కొత్తగా ఆలోచించి తమదైన రీతిలో నిర్ణయం తీసుకున్నారు. ఇసుక మొత్తం ఒక్కరికే కట్ట బెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంలో మంత్రి పాత్ర పరిమితంగా ఉంది. గతంలో వైసీపీలో ఉన్న అత్యంత సీనియర్లుగా కొన్ని విధానపరమైన ప్రకటనలకు.. ఆయనకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పార్టీ తరపున.. ప్రభుత్వం తరపున ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. పార్టీ కూడా కల్పించడం లేదు.
అందుకే.. పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాధాన్యత తగ్గుతోందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన వ్యవహారశైలేనని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థతో ఢీ కొడుతుండటం.. ఆయన కేసుల రెగ్యులర్ విచారణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా.. ఎమ్మెల్యేలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారని అంటున్నారు.
Also Read: హతవిధీ.. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నను పట్టించుకునే వారే లేరా?
చిత్తూరు జిల్లాలో ఒక్క రోజా తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా ఆయన గుప్పిట్లోనే ఉన్నారు. ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతోనూ ఆయన టచ్‌లో ఉంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆయనపై ఇంటలిజెన్స్ నిఘా పెట్టించారని.. ప్రాధాన్యత తగ్గించారని చెబుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని కల్పించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్