బీహార్‌లో ఎవరు సీఎం.. ఎవరు‌ డిప్యూటీ సీఎం?

బీహార్‌‌లో మూడో విడత పోలింగ్‌ ముగియడంతో ఒకేసారి ఎగ్జిట్‌ పోల్స్‌ రిజల్ట్స్‌ బయటకొచ్చాయి. వాటి లెక్కల ప్రకారం.. ఈ సారి నితీశ్‌ కుమార్‌‌కు ప్రజలు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించారు. బీహార్‌‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ మహాకూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నట్లు చెప్పాయి. కానీ.. చివరికి ఫలితాలు తారుమారయ్యాయి. చివరి వరకూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠ పోరులో ఎన్డీఏనే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటింది. Also Read: ట్రంప్ కు వెన్నుపోటు: వాషింగ్టన్ రక్తసిక్తం.. మారణాయుధాలతో స్వైరవిహారం ఈ […]

Written By: NARESH, Updated On : November 15, 2020 2:50 pm
Follow us on

బీహార్‌‌లో మూడో విడత పోలింగ్‌ ముగియడంతో ఒకేసారి ఎగ్జిట్‌ పోల్స్‌ రిజల్ట్స్‌ బయటకొచ్చాయి. వాటి లెక్కల ప్రకారం.. ఈ సారి నితీశ్‌ కుమార్‌‌కు ప్రజలు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించారు. బీహార్‌‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ మహాకూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నట్లు చెప్పాయి. కానీ.. చివరికి ఫలితాలు తారుమారయ్యాయి. చివరి వరకూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠ పోరులో ఎన్డీఏనే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటింది.

Also Read: ట్రంప్ కు వెన్నుపోటు: వాషింగ్టన్ రక్తసిక్తం.. మారణాయుధాలతో స్వైరవిహారం

ఈ ఎన్నికలు తనకు చివరివి అని.. మరోసారి బరిలోకి దిగేది లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌‌ ప్రచారం చేశారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఎంతగానో కష్టపడ్డారు. ఎన్నిక‌ల పోరు తుది అంకానికి చేరిన ద‌శ‌లో త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌ని, గెలిపించాల‌ని ఆయ‌న సెంటిమెంట్ పాచిక విసిరారు. నాలుగో సారి ముఖ్యమంత్రి కావాలని సర్వ శక్తులూ ఒడ్డారు. చివరికి విజయం సాధించారు.

బీహార్ రాజకీయం నేడు తుది అంకానికి చేరుకోనుంది. ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ఎన్డీఏ… తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆదివారం ప్రకటించనుంది. ఆదివారం ఎన్డీఏ పక్ష భేటీ జరగుతోంది. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరు కానున్నట్లు సమాచారం. ఎన్డీఏ పక్షానికి చెందిన 125 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరుకానున్నారు. మరోసారి నితీశ్‌నే సీఎంగా కొనసాగించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే అధికారికంగా మాత్రం నితీశ్‌ను శాసనసభ నాయకుడిగా ఈ సమావేశ వేదికగా ప్రకటించనున్నారు.

Also Read: దిద్దుబాటు చర్యలకు దిగిన కేసీఆర్‌‌ సర్కార్‌‌

నితీశ్‌ను సీఎం పదవిలో కొనిసాగిస్తున్న డిప్యూటీ సీఎం విషయంలో తర్జనభర్జన మొదలైంది. డిప్యూటీ సీఎం పదవిలో సుశీల్ మోదీనే కొనసాగిస్తారా? లేక మారుస్తారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వెంటనే ఢిల్లీకి రావాలని సుశీల్ మోదీని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం జరుగనున్న బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలోనే డిప్యూటీ సీఎం అభ్యర్థిని కూడా ఎన్నుకోనున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్