https://oktelugu.com/

పులివెందుల వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కడప జిల్లా  వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. అయితే గత మూడు రోజుల కిందటి నుంచే వీరి మధ్య […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 15, 2020 / 01:34 PM IST
    Follow us on

    కడప జిల్లా  వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. అయితే గత మూడు రోజుల కిందటి నుంచే వీరి మధ్య గొడవ జరుగుతోంది. అయితే ఆదివారం గొడవ పెద్దదిగా మారి ఘర్షణకు దారి తీసింది.