CM Jagan: జగన్ ఎప్పుడైతే కొత్త కేబినెట్‌కు శ్రీకారం చుట్టారో.. అప్పటి నుంచే ఇటు పార్టీలో కూడా సమూలమైన మార్పులుచేపడుతున్నారు. ఇక 14మంది మంత్రి పదవులు తీసేసిన జగన్ వారిని పార్టీ పనుల్లో వాడుకుంటామని గతంలోనే ప్రకటించారు. ఈ సారి ప్రాంతీయ, కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. ఏయే ప్రాంతంలో ఏయే వర్గం వారు అధికంగా ఉన్నారో లెక్కలేసుకుని.. ఆ వర్గం నేతకే ఆ ప్రాంతంలో పార్టీ పగ్గాలను ఇవ్వనున్నారు.
అయితే ఇదే సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి చెక్ పెట్టినట్టు సమాచారం. సాయిరెడ్డి గతంలో ఢిల్లీలో అనుసంధాన కార్యక్రమాలతో పాటు.. ఇటు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను చూసుకునే వారు. కానీ ఆయన పాత్రను తగ్గిస్తూ.. ఆ ప్లేస్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలను ఇవ్వనున్నారు. ఇక ఆయనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా బాధ్యతలలు అప్పటించనున్నారు.
Also Read: TSRTC MD Sajjanar: ఈసారి ఎన్టీఆర్ వీడియోను వాడేసిన సజ్జనార్.. తెగ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..
ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని పరుగులు పెట్టించే బాధ్యతను ఎంపీ మిథున్ రెడ్డికి ఇస్తారు. అలాగే టీడీపీ ప్రభావం ఉన్న జిల్లాల్లో మాజీ మంత్రి కొడాలి నానికి బాధ్యతలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణా- గుంటూరు జిల్లాల బాస్‌గా ఆయనను నియమించనున్నారు. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. కాబట్టి వారిని ప్రభావితం చేయాలంటే నానికే సాధ్యమని భావిస్తున్నారు జగన్.
ఇక అటు జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాస్ కాబోతున్నారు. ఇక రాయలసీమ జిల్లాల బాధ్యతలను పూర్తిగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకోబోతున్నారు. అంటే ఏ వర్గం ప్రజలు ఎక్కడ అధికంగా ఉంటే.. అక్కడ ఆ వర్గం వారికి బాధ్యతలు ఇస్తున్నారన్నమాట.
తాను కుల సమానత్వాన్ని కోరుకుంటానని చెప్పే జగన్.. కులం మనిషిని ముందు పెట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం ఏంటనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఎక్కడైనా అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి గానీ.. కుల సమీకరణాల మీద ఆధారపడి ఓట్లు అడగం ఏంటని అందరూ విమర్శిస్తున్నారు.