TSRTC MD Sajjanar: ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మామూలుగా పోలీసుల పేర్లు అన్ని ప్రాంతాల ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ ఈయన పేరు మాత్రం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి సుపరిచితమే. ఎందుకంటే ఆయన ఏ శాఖలో ఉన్నా సరే తన ప్రత్యేకతను చాటుకున్నారు. డ్యూటీని నిబద్ధతతో చేయడం అంటే ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ శాఖలో ఉన్న సరే దానికి గుర్తింపు తీసుకు వచ్చే విధంగా అహర్నిశలు కష్టపడుతుంటారు.
ఒకప్పుడు పోలీస్ శాఖలో సీపీగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఆ శాఖను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఇందుకోసం సరికొత్త విధానాలను తీసుకువస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాగా ఆయన సోషల్ మీడియాను ఎంతలా వాడుకుంటారో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసే వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ హీరోలకు సంబంధించిన వీడియోలను తన శాఖకు అనువయిస్తూ అవగాహన కల్పిస్తుంటారు.
ఇక ఇప్పుడు కూడా తారక్ వీడియోను వాడేశారు ఆయన. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలోని డైలాగ్ ను రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వాడుకున్నారు. ఇందులో.. “ఓ ఓసన్న.. రోడ్డు జాగిలంగా ఉందని 100, 200 కొట్టకు.. 50, 60లో పో..” అంటూ చెబుతాడు. ఈ వీడియోను షేర్ చేశారు సజ్జనార్.
అంటే రోడ్డు బాగుంది కదా అని ఓవర్ స్పీడ్ గా వెళ్లొద్దని ఆయన ఈ విధంగా చెబుతున్నారన్నమాట. ఈ వీడియో చూసిన తారక్ అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఎంతైనా ఇలా అవగాహన కల్పించడం కేవలం సజ్జనార్ కే సాధ్యమవుతుంది కదా. అయితే ఆయన ఇలాంటి వీడియోలు షేర్ చేయడం కొత్తకాదు. గతంలో కూడా ఆయన చాలా వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. అప్పుడు ఆయా హీరోల అభిమానులు వాటిని కూడా వైరల్ చేశారు.
#TSRTCRoadSafety @tarak9999 Garu appealing to maintain #Speedlimit on Roads @TarakSpace @TeamTarakTrust @igtelugu @CYBTRAFFIC @RachakondaCop @HYDTP @TeamNTRTrends @NTR2NTRFans #ManOfMasssesNTR @NTRFanTrends @worldNTRfans @JrNTR_ @baraju_SuperHit @MilagroMovies @KkVelicheti pic.twitter.com/5PnAPW1kIS
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 17, 2022