Love Marriage: వేయి మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపిస్తే చాలని చెబుతుంటారు. అందరు మాటలు మాత్రం చెబుతారు కానీ చేతలు మాత్రం చేయరు. ప్రేమించానని వెంట పడుతూ తన ప్రేమను అంగీకరించకపోతే వేధింపులకు గురిచేయడం, యాసిడ్ దాడికి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. కానీ మనసు పడినందుకు నూరేళ్లు తోడుంటానని చెప్పి వివాహం చేసుకోవడం ఎంతమంది చేస్తున్నారు. కోరిక తీర్చుకుని నీకు నాకు సంబంధం లేదని చెప్పే స్వార్థపరులున్న సంఘంలో నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న జంటను అందరు ప్రశంసిస్తున్నారు.
Also Read: AP Capitals: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మూతి వసంతరావు (22), మణుగూరుకు చెందిన దివ్యాంగురాలు నరసమ్మ(21) ప్రేమించుకున్నారు. దివ్యాంగురాలైన నరసమ్మపై వసంతరావు మనసు పడ్డాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఆశ్రయించారు. కానీ వారు అడ్డు చెప్పడంతో వారిని ఎదిరించేందుకు సిద్ధమయ్యారు.
కుటుంబసభ్యులు ఆక్షేపించినా వారు మాత్రం తమ మనసు మార్చుకోలేదు. కలిసి బతకడానికి మనసులు ముఖ్యం కాని శరీరాలు కావని వారు అందరిని ఎదిరించి వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా వారు విభిన్న ప్రతిభావంతుల సంఘం, దివ్యాంగ ఉద్యోగుల సంఘాన్ని ఆశ్రయించి రుద్రంపూర్ లోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో వధువును వరుడు ఎత్తుకుని వచ్చి నరసమ్మకు కొత్త జీవితాన్ని ఇవ్వడంతో అందరు అభినందించారు.
Also Read: Bride market: పెళ్లికూతుళ్లు అమ్మబడును.. ఆశావహులు త్వరపడండి