https://oktelugu.com/

Samantha hurt: మరోసారి హర్ట్ అయిన సమంత.. బుంగమూతి పెట్టిందిగా?

Samantha hurt: విడాకుల తర్వాత సమంత సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే సమంత ప్రతీసారి ఏదో ఒక విషయంలో హార్ట్ అవడం.. బుంగమూతి పెట్టడం ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది. అలాగే తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకోవడం సమంతకు అలవాటు. తాజాగా ఓ కంపెనీ చేసిన పని తనకు ఎంతో బాధను కలిగించిందంటూ సమంత అసలు విషయాన్ని బయటపెట్టింది. సమంతకు బ్లాక్ బెర్రీ ఫోన్లు అంటే చాలా […]

Written By: , Updated On : January 8, 2022 / 11:27 AM IST
Follow us on

Samantha hurt: విడాకుల తర్వాత సమంత సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే సమంత ప్రతీసారి ఏదో ఒక విషయంలో హార్ట్ అవడం.. బుంగమూతి పెట్టడం ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది. అలాగే తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకోవడం సమంతకు అలవాటు. తాజాగా ఓ కంపెనీ చేసిన పని తనకు ఎంతో బాధను కలిగించిందంటూ సమంత అసలు విషయాన్ని బయటపెట్టింది.

actress samantha latest post on instagram got viral

సమంతకు బ్లాక్ బెర్రీ ఫోన్లు అంటే చాలా ఇష్టం. తన ఫేవరేట్లో ఈ కంపెనీ మొబైల్స్ ఒకటని తెలుస్తోంది. దాదాపు పదేహేనేళ్లు ఇండియాలో సేవలందించిన బ్లాక్ బెర్రీ సంస్థ తన ఫోన్ల తయారీని 2016 నుంచి నిలిపివేస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది. అయితే ఇటీవల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సొంత ఓఎస్ ఫోన్లు కూడా పని చేయవంటూ ఆ కంపెనీ కస్టమర్లకు షాకిచ్చింది. ఈక్రమంలోనే తమ ఫోన్ల శకం ముగిసిందని బ్లాక్ బెర్రీ సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్ బెరరీ ఫోన్లను వాడుతున్న యూజర్లంతా నిరుత్సానికి గురవుతున్నారు.

అందరిలాగే ఈ విషయం తనకెంతో బాధను కలిగిందని సమంత తన అభిమానులతో తాజాగా పంచుకున్నారు. ఈ ఫోన్ అంటే తనకెంతో ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టింది. 2000 సంవత్సరంలో చాలామంది సెలబ్రెటీలు, సినిమా స్టార్స్ ఈ ఫోన్లను ఉపయోగించే వాళ్లని.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ కంపెనీ ఫోన్ నే వాడేవారంటూ సమంత గుర్తు చేసుకున్నారు.

మొత్తానికి బ్లాక్ బెర్రీ ఫోన్ల శకం ముగియడంతో అందరి లాగానే సమంత కూడా బాధతో విడ్కోలు పలికింది. ఇదిలా ఉంటే సమంత ‘పుష్ప’ మూవీ తర్వాత ‘శకుంతలం’, ‘యశోధ’ అనే మూవీల్లో నటిస్తూ పుల్ బీజీగా గడుపుతోంది. అలాగే ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.