Chanakya -Niti: సాధారణంగా మానవజన్మ అనగానే ఏదో ఒక విషయంలో మనకు శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మనకున్న శత్రువులను మన శారీరక బలంతో కాకుండా మన ఆలోచన విధానంతో, మన ప్రవర్తనతో వారిని ఎలా లొంగదీసుకోవాలి అనే విషయాల గురించి ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించారు. మరి శత్రువుల దాడి మనపై ఉండకుండా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
అప్రమత్తంగా ఉండటం: మన శత్రువులను మనం గుర్తించిన తర్వాత మనం ఎంతో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మన శత్రువు ఎప్పుడు మన అజాగ్రత్తను పరిశీలిస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్క క్షణం మనం ఎంతో అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే గుణం అలవాటు చేసుకోవాలి. ఇలా అప్రమత్తంగా ఉండటం వల్ల శత్రువుల దాడిని ఎదుర్కోవచ్చు.
Also Read: జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?
శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి: ఆచార్య చాణిక్యుడు శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తెలిపిన విషయాలలో అతి ముఖ్యమైన విషయం ఇదే. మనం మన శత్రువునిఎదుర్కోవాలంటే ముందుగా మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వారిని ఎదుర్కోగలం మనం మానసికంగా లేదా శారీరకంగా బలంగా లేనప్పుడు దానిని అవకాశంగా తీసుకొని శత్రువులపై దాడి చేస్తాడు అందుకే ఎంతో దృఢంగా ఉండాలని తెలిపారు.
చెడు అలవాట్లకు దూరం: మనలో ఉండే చెడు అలవాట్లు మన శత్రువులకు అనేక మార్గాలను చూపిస్తాయి. అందుకే వీలైనంత వరకు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల శత్రువులను ఓడించవచ్చని ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథంలో తెలియజేశారు.
Also Read: టైం మిషన్ లో వర్తమానానికి.. వారి ‘ఒకే ఒక జీవితం’ ఏమైంది?