YCP: దేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. పలు స్టేట్లలో మనుగడలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తమ కూటమిలో చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణల కారణంగా వాటిని తమ కూటమిలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇందు కోసం ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తోంది. పదవులు ఆశచూపైనా భాగస్వాములను చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వైసీపీ ఎన్టీయేలోకి రావాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ప్రతిపాదించడంతో జగన్ తదనుగుణంగా స్పందించడం లేదు. ఒక విధంగా వైసీపీకి కూడా అవసరమే కానీ ఎన్డీయేలో చేరేందుకు మాత్రం వెనుకాడుతోంది. ఈ క్రమంలో వైసీపీని ఎలాగైనా తమలో కలుపుకోవాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. వైసీపీతో ఏమైనా ఉంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలని భావిస్తున్నా ఎన్డీయేలో భాగస్వామిని చేసుకోవాలని చూస్తోంది.
జగన్ అధికారంలోకి రావడంతోనే ఆయనను ఎన్డీయేలోకి తీసుకురావాలని భావించినా సున్నితంగా తిరస్కరించడంతో వీలు కాలేదు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమి బలం పెంచుకునే క్రమంలో వైసీపీ అండ అవసరమవుతోంది. రాజ్యసభ చైర్మన్ లేదా కేంద్ర మంత్రుల పదవులు కేటాయించి తమలో భాగస్వామిగా వైసీపీని చేసుకోవాలని ముఖ్య నేతలు ఆలోచిస్తున్నారు.
Also Read: Rayalaseema water issues: సీమ నీటి ఫైట్.. జగన్, మోడీని ఢీకొంటారా?
ఇప్పటికి బయట నుంచి మద్దతు ఇస్తున్నా కూటమిలో భాగం కావాలని చూస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయితే బలం మరింత పెరుగుతుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో సభ్యుల సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీల బలాన్ని కూడా కూడగట్టుకునేందుకు సిద్ధపడుతోంది. దీంతోనే పలు పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే దక్షిణాది స్టేట్ల పై తమ ప్రభావం చూపించుకోవాలని భావిస్తోంది.
Also Read: Kesineni Nani: పార్టీని వీడేందుకు కేశినేని నాని సిద్ధమేనా?