రోజా పోస్ట్ ఊస్ట్: జగన్ షాకిచ్చారా? మంత్రిపదవిస్తారా?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన నేతల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఒకరు. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని అరెస్ట్ అయ్యి.. అసెంబ్లీలోకి నిషేధం ఎదుర్కొని జగన్ కు బాసటగా నిలిచారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆమెను పక్కనపెట్టారు. సామాజిక కోణం చూపి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత అలిగిన రోజాకు ఏపీఐఐసీ నామినేటెడ్ పోస్టు ఇచ్చి కూల్ చేశారు. తాజాగా […]

Written By: NARESH, Updated On : July 17, 2021 7:00 pm
Follow us on

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన నేతల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఒకరు. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని అరెస్ట్ అయ్యి.. అసెంబ్లీలోకి నిషేధం ఎదుర్కొని జగన్ కు బాసటగా నిలిచారు.

కానీ జగన్ సీఎం అయ్యాక ఆమెను పక్కనపెట్టారు. సామాజిక కోణం చూపి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత అలిగిన రోజాకు ఏపీఐఐసీ నామినేటెడ్ పోస్టు ఇచ్చి కూల్ చేశారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే రోజా పోస్ట్ ఊస్ట్ అయ్యింది. ఆమె చేస్తున్న ఐపీఐఐసీ చైర్మన్ పదవిని జగన్ తొలగించి మెట్టు గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు. దీంతో రోజా సహా ఆమె అభిమానులు సైతం షాక్ అయ్యారు.

రోజాకు తొలివిడతలో మంత్రి పదవిని జగన్ ఇవ్వలేదు. ఇక మలివిడతలో రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ విస్తరణలో ఇస్తారని అంటున్నారు. దానిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడున్న పోస్ట్ ను సైతం జగన్ తొలగించడంతో రోజా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రోజాకు మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు నుంచి తొలగించారా? లేదా ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండవద్దన్న జగన్ నిర్ణయం మేరకు రోజాను పక్కనపెట్టారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇక రోజాతోపాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం జగన్ షాక్ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రోజాకు షాకిచ్చినట్టా? లేక మంత్రి పదవి కోసమా? అన్నది తేలాల్సి ఉంది.