
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా భారీ నోటిఫికేషన్ రిలీజైంది. 25, 271 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 22,424 ఉద్యోగ ఖాళీలు ఉంటే మహిళలకు 2,847 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని తెలుస్తోంది.
పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి పురుషులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి అర్హత ఆధారంగా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతననం లభించనుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల గురించి, ఇతర విషయాల గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.