https://oktelugu.com/

ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.40 పొదుపుతో రూ.39 లక్షలు..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి కాగా 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే లైఫ్ కవర్ తో పాటు మెచ్యూరిటీ తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 17, 2021 3:47 pm
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి కాగా 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే లైఫ్ కవర్ తో పాటు మెచ్యూరిటీ తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

    ఈ విధంగా ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉండగా ఈ పాలసీ ఎండోమెంట్ పాలసీ కావడం గమనార్హం. ఈ పాలసీ తీసుకోవడం వల్ల 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సులో 5 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు 1,280 రూపాయలు ప్రీమియం చెల్లించాలి.

    15, 20, 25, 30 ఏళ్ల టర్మ్‌తో ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 సంవత్సరాల వయస్సులో పాలసీ తీసుకుని 30 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత ఏడాదికి రూ.40 వేలు వస్తాయి. వందేళ్ల వరకు ప్రతి సంవత్సరం ఈ విధంగా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    100 సంవత్సరాల తర్వాత కూడా జీవించి ఉంటే బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం పొందే అవకాశం ఉంటుంది. సమీపంలో ఎల్‌ఐసీ బ్రాంచ్ లేదా ఎల్‌ఐసీ ఏజెంట్ ను సంప్రదించి ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ పాలసీ తీసుకునే వాళ్లకు ఇతర పాలసీలతో పోలిస్తే ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు.