
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయిన తరువాత చాలా వరకు నష్టాలు జరిగాయి. కేంద్రం నుంచి వచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటికూడా అమలుకాలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయమై ముఖ్యమంత్రి, ఏపీలు.. ముఖ్యులు కేంద్రంతో చర్చలు జరిపినా.. పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఒక లేఖ కూడా రాశారు. మోదీ నుంచి జవాబు వచ్చిన తరువాతనే అఖిలపక్షం సంగతి తేలుతుంది. ఒకవేళ అఖిలపక్షంతో భేటీకి మోదీ సుముఖత వ్యక్తం చేస్తే.. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరూ కలిసి జగన్ నేతృత్వంలో వెళ్తారా.. అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాతే మొదీ అఖిలపక్షాన్ని కలిసే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.
నిజానికి గతంలొ చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో మోదీవద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు. అప్పట్లో విపక్షాలన్నీ ఎన్నిసార్లు డిమాండ్ చిసాన.. ఆయన ప్రత్యేక ప్యాకేజీ వైపు మాత్రమే మొగ్గు చూపారు. చివరికి ప్రత్యేక హోదాకూడా ఎటూకాకుండా పోయింది. దాని ఫలితాన్ని చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సందర్భంగా అనుభివించారు. ఇప్పుడు జగన్ ఆ పొరపాటును చేయదలుచుకోలేదు. తాను అఖిలపక్షంతో వస్తానని అపాయింట్మెంట్ ఇవ్వాలని మోదీకి లేఖ రాశారు.
అయితే చంద్రబాబు నాయుడు.. జగన్ నేతృత్వంలో ప్రధాని మోదీనికి కలిసేందుకు వెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మోదీ చంద్రబాబుకు చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడిప్పుడే బీజేపీకి చంద్రబాబు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ తో కలిసి నడవగలరా..? అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అఖిలపక్షానికి మోదీ అనుమతి ఇస్తే.. పార్టీ తరఫున అచ్చెన్నాయుడును ఢిల్లీకి పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. జగన్ నేతృత్వంలో మొదీని కలిసేందుకు పవన్ కల్యాణ్ అస్సలు ఇష్టపడరు. దీనికి తోడు మోదీ అపాయింట్ మెంట్ తనకు ఇవ్వకపోవడంతో కూడా పవన్ గుర్రుగా ఉన్నారు. ఆయన కూడా తన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ ను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే.. జగన్తో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు ఏపీలోని ప్రధాన పార్టీలు ఏవీ ఇష్టపడడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణను రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నా.. మోదీ ముందుకు వెళ్లేందుకు మాత్రం వీరికి ముహం చెల్లడం లేదు.