https://oktelugu.com/

ప్రభుత్వాలు మారినా.. ఆగని రాజీ‘డ్రామాలు’

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ ఉద్యమం రోజురోజుకు వేడెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తామని మొండిగా ముందుకు సాగుతోంది. కానీ అడ్డుకోవాల్సిన రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానం విశాఖ పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులపై ఈ ఒత్తడి మరీ అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2021 / 09:53 AM IST
    Follow us on


    విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ ఉద్యమం రోజురోజుకు వేడెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తామని మొండిగా ముందుకు సాగుతోంది. కానీ అడ్డుకోవాల్సిన రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానం విశాఖ పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులపై ఈ ఒత్తడి మరీ అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

    ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు తమ పార్టీ అని చెప్పకునేందుకు టీడీపీ సిద్ధంగా లేన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీలు అందరూ.. రాజీనామా చేయాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం రాజీనామాలతో ప్రయోజనం ఏం ఉంటుందని ప్రశ్నిస్తోంది. పదవుల్లో ఉండి పోరాడితే ఫలితం దక్కుతుందని విజయసాయిరెడ్డి వంటి నేతలు బాహాటంగా చెబుతున్నారు.

    అయితే మూడు సంవత్సరాలు వెనక్కు వెళితే.. ప్రత్యేక హోదాకోసం జగన్ తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని విపక్ష నేతగా జగన్ అప్పుడు గట్టిగా డిమాండ్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం రాజీనామాలకు సిద్ధ పడలేదు. వైసీపీ ఎంపీలు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేయడంతో హోదా విషయం పెద్దగా వర్కవుట్ కాలేదు.

    కాగా.. అప్పుడు.. ఇప్పుడు టీడీపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ రాజీనామాలకు డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ మాత్రం ససేమీరా అంటోంది. ప్రధానంగా విశాఖ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తీవ్రంగా కనిపిస్తోంది. రాజకీయ సవాళ్లు తప్పించి ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంటును ఏ విధంగా పరిరక్షించుకుందామన్న ఆలోచన ఏ రాజకీయ పార్టీలోనూ కనిపించడం లేదు. మొత్తం మీద అప్పుడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు స్టీల్ ప్లాంటు విషయంలో రాజీడ్రామాలు కొనసాగుతూనే ఉన్నాయి.