CM Jagan Cabinet Reshuffle: సీఎం జగన్ సంచలన నిర్ణయంకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ధైర్యం తో పాటు కొత్తదనాన్ని తీసుకువచ్చే నిర్ణయం. ఇప్పుడున్న మంత్రుల్లో చాలామందిని మార్చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ లోగా ఈ పని పనిచేయనున్నారు. అయితే జగన్ 2024 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోసారి అధికారమే లక్ష్యంగా అవినీతి మరకలు అంటకుండా మంత్రులను మార్చేయబోతున్నారు.
కేబినెట్ లో ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామందిని మార్చడానికి రెడీ అయిపోయారు. గతంలో మొత్తం మందిని మార్చేస్తానని చెప్పినా కూడా.. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కొందరిని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. ఉగాది తర్వాత కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుంది. కాబట్టి తొలగించిన మంత్రులకు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వనున్నారు జగన్.
Also Read: జగన్ వేటు వేసేది వారి మీదేనా.. సామాజిక వర్గాల ఆధారంగానే మార్పు..?
కాకపోతే కొత్తగా వచ్చిన మంత్రుల ముందు మాజీ మంత్రులు చిన్న పోక తప్పదు. కొత్తగా మంత్రి అయిన వారి పెత్తనమే ఆయా జిల్లాల్లో కొనసాగుతుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో కీలక నేతలకు ప్రాముఖ్యత తగ్గిందనే భావన వారి అభిమానుల్లో, నియోజకవర్గ ప్రజల్లో వస్తే మాత్రం అంతిమంగా వైసీపీకి దెబ్బ పడుతుంది.
పైగా కొందరిని కొనసాగించడం కూడా ఇక్కడ తీవ్ర అసంతృప్తులకు దారి తీస్తుంది. తొలగించిన మంత్రుల సామాజిక వర్గాలు తమను చిన్నచూపు చూస్తున్నారు అనే భావన ఏర్పడితే మాత్రం.. 2024 ఎన్నికల ఫలితాలు తారుమారై పోతాయి. ఎందుకంటే ఏపీలో కుల ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి జగన్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
పైగా జగన్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 20 మందికి కొత్తగా అవకాశం ఇచ్చినా.. కేబినెట్ హోదా దక్కించుకున్న వారు 40 నుంచి 45 మంది అవుతారు. కాబట్టి మిగతా వారు తమకు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తిలో ఉంటారు. దీంతో 2024 ఎన్నికల వరకు వేరే పార్టీ ప్రభావం పెరిగితే మాత్రం ఈ అసంతృప్తులు ఇతర పార్టీలోకి మారే అవకాశం లేకపోలేదు. ఇలా ఎటు చూసుకున్న కూడా జగన్ కు నలువైపులా ఇబ్బందులు తప్పేలా లేవు.
మరి మిక్సింగ్ చేయడంలో కింగ్ అని పేరు తెచ్చుకున్న జగన్.. ఈ విషయంలో ఏమాత్రం తప్పటడుగులు వేసినా అది వైసీపీని పెద్ద దెబ్బ కొడుతుంది. ఇంకోవైపు జనసేన ఇలాంటి పార్టీ పుంజుకోవడం కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని నష్టపరిచేలా ఉంది. చూడాలి మరి జగన్ అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారో.
Also Read: కాంగ్రెస్ ‘హస్తం’ ఖతం.. దాన్నుంచే ఆమ్ఆద్మీ ‘చీపురు’ పుట్టుకొస్తోందా? పేలుతున్న మీమ్స్