AP Cabinet Expansion: మొన్నటి వరకు కొంత మాత్రమే చర్చ సాగిన మంత్రివర్గ ప్రక్షాళన.. ఇప్పుడు వైసీపీ లో హాట్ టాపిక్ అయింది. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో జగన్ స్వయంగా మంత్రివర్గ ప్రక్షాళన గురించి స్పందించారు. అయితే అందరినీ మార్చటం లేదని కొందర్ని మారుతున్నట్టు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఇదే వైసీపీలో కలకలం రేపుతోంది. మంత్రివర్గ పక్షాలన గురించి కేబినెట్లో చర్చించిన విషయాలను కావాలనే మీడియాకు లీక్ చేశాయి వైసీపీ వర్గాలు.
అయితే తొలగించిన మంత్రులను పార్టీ జిల్లాల అధ్యక్షులుగా చేస్తామంటూ జగన్ చెబుతున్నారు. ఎలాగూ కొత్త జిల్లాలు ప్రకటించారు కాబట్టి.. ఆ జిల్లాల అధ్యక్ష పదవులు ఇప్పుడు జగన్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. తొలగించిన మంత్రులను బుజ్జగించేందుకు ఆ పదవులను జగన్ వాడుకునే అవకాశం ఉంది. అయితే కొందరిని మంత్రులుగా కొనసాగించడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాలు, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నేతలు, వ్యూహాలు పండడంలో దిట్ట అయిన సమర్థులను జగన్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: కాంగ్రెస్ ‘హస్తం’ ఖతం.. దాన్నుంచే ఆమ్ఆద్మీ ‘చీపురు’ పుట్టుకొస్తోందా? పేలుతున్న మీమ్స్
ఏపీలో బలమైన సామాజిక వర్గాలు కమ్మ, కాపు, రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గాలకు జగన్ పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఈ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వర్గాలకు చెందిన మంత్రులను జగన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా ఇన్ని రోజులు ఈ వర్గాల మంత్రులే జగన్ కేబినెట్ లో కీలకంగా పనిచేస్తున్నారు. కాబట్టి వీరిని పక్కనపెట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, కేబినెట్ లో పెద్దగా గుర్తింపు లేని వారిని జగన్ తొలగించనున్నట్లు సమాచారం.
కేబినెట్ లో ఈ తరహా మంత్రులే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. జగన్ తాను మంత్రి పదవి నుంచి తీసేసినా పార్టీని, పార్టీ లైన్ ను వీడని వారి మీదనే వేటు వేయనున్నట్టు సమాచారం. వీరికి జిల్లాల అధ్యక్ష బాధ్యతల నుంచి పని చేయించుకోవాలని జగన్ భావిస్తున్నారు. కాకపోతే జగన్ అంచనాలు నిజమవుతాయంటే చెప్పలేము. పదవి తీసేస్తే చాలామంది గ్రూపు రాజకీయాలకు తెర తీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. జగన్ నిర్ణయంతో ఇవి మరింత పిక్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
Also Read: అసెంబ్లీలో స్పీకర్ పై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి