Pawan Kalyan- Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాను పరమభక్తుడిని అని సగర్వంగా చాటి చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ ఫోటోలు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. పవన్ కళ్యాణ్ సెట్స్లో కసరత్తులు చేస్తూ కనిపించారు.

నిపుణుల ఆధ్వర్యంలో బల్లెంతో పోరాట ఘట్టానికి సంబంధించిన సన్నివేశాలను శిక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే,ఈ ఫొటోలను బండ్ల గణేశ్ కూడా ట్విట్టర్ లో షేర్ చేసి ‘‘గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరి పై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర’’ అని రాసుకొచ్చారు.
Also Read: Bigg Boss Telugu OTT: స్రవంతికి అఖిల్ బ్యాచ్ వెన్నుపోటు.. ప్రతీకారం కోసం అలా చేసిన బ్యూటీ..
అన్నట్టు బండ్ల గణేష్ కూడా పవన్ కోసం కథను వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ కి ఇప్పటికే పవన్ డేట్స్ ఇస్తానని చెప్పడంతో.. బండ్ల సీరియస్ గా కథల పై పడ్డాడు. బండ్ల కథ వెతికే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు, రైటర్స్ ను కలుస్తున్నాడట. అయినా పవన్ ఇమేజ్ కు సరిపోయే కథను మాత్రం ఎవరూ చెప్పట్లేదట.

అందుకే, పవన్ కి సరిపోయే కథను సిద్ధం చేయండి అంటూ రచయితలను దర్శకులను రిక్వెస్ట్ చేస్తున్నాడు బండ్ల గణేష్. కథ ఫైనల్ అయిన తర్వాత.. ఇక పవన్ తో చేయబోయే సినిమా వివరాలు బయటికి చెప్తానంటున్నాడు బండ్ల గణేష్. నిజానికి ఆ మధ్య ఓ తమిళ యువ రచయిత జాన్ అనే అతని దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.

జాన్ కథను పవన్ కోసం సెట్ చేయాలని బండ్ల ప్లాన్ చేశాడు. కథలో పవన్ పాత్ర చాల కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని.. పవన్ కి జాన్ కథ నచ్చుతుందని బండ్ల తన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చాడు కాలేజీ నేపథ్యంలో సినిమా కాబట్టి, పవన్ ది కూడా లెక్చరర్ పాత్ర కాబట్టి.. సమాజం పై, సూక్తులు గట్రా బాగానే పెట్టుకోవచ్చు. పవన్ రాజకీయాలకు కూడా ఈ కథ పనికొస్తోంది. కానీ ఎందుకో ఈ కథ గురించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.
Also Read:Venkatesh Remake Movies: వెంకటేశ్ నటించిన టాప్ 10 రీమేక్ మూవీలు ఏవో తెలుసా..?