సీఎం జగన్ ఏపీలో అధికారం చేపట్టాక సంక్షేమం అభివృద్ధి కోణంలో దూసుకుపోతున్నా పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో మాత్రం తేలిపోతున్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు హయాంలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలను సైతం తాజాగా కాలుష్య నియంత్రణ సంస్త పేరుతో నిబంధనలు ఉల్లంఘించారని వరుసగా మూసివేస్తుండడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ఈ పరిణామంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వ చర్యలు పారిశ్రామక వర్గాల్లో భయాన్ని కలిగిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీకి పరిశ్రమలు రాక అనేది లేకపోగా.. గతంలో పరిశ్రమలు పెడుతారు అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేసి భూములు కేటాయిస్తున్నట్టుగా చెబుతున్న వారు కూడా ఇంతవరకు జగన్ సర్కార్ చర్యలతో భూములు పెట్టడానికి ముందుకు రాకపోవడం షాక్ కు గురిచేస్తోంది.
ఏపీ సీఎం జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాకపోగా.. రాజకీయ ప్రత్యర్థుల పరిశ్రమలను వరుసగా మూసివేస్తుండడంతో కొత్త పరిశ్రమలు వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు.
తాజాగా ఏపీ హైకోర్టులో ఓ సంచలన తీర్పు వచ్చింది. సీఎం జగన్ సొంత జిల్లాలో వారి సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ‘భారతి’కి పోటీగా ఉన్న జువారీ సిమెంట్ పరిశ్రమను మూసివేయించిన ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్వులను కొట్టి వేస్తూ హైకోర్టు ఏపీ సర్కార్ కు షాకిచ్చింది.
ఇక ఇంతకుముందే ఏపీలోని చిత్తూరులో ఉన్న ప్రపంచప్రఖ్యాత ఆమెరూన్ కంపెనీని సైతం జగన్ సర్కార్ మూసివేయించింది. అందులోని 16వేల మందిని రోడ్డున పడేసింది. కరెంట్ కట్ చేసి కంపెనీని మూసివేయాలని ఆదేశించడంతో ఈ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ ఇప్పుడు హైకోర్టుకు ఎక్కేందుకు రెడీ అయ్యింది.
ఇలా వరుసగా ప్రత్యర్థుల కంపెనీలను ఏరవేస్తున్న జగన్ సర్కార్ తీరుపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.