సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి, అందుకే అనుపమను సైడ్ చేశారు అని దీనిపై అప్పట్లో అనేక కథనాలను తెగ వైరల్ చేశారు. ఇక అనుపమ కూడా ఈ విషయంలో తెగ హర్ట్ అయిపోయి ఇదైపోయింది అని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల పై అప్పటి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందిస్తూ.. తమ రాబోయే సినిమాల్లో అనుపమతో కచ్చితంగా కలిసి పనిచేస్తాం అని వివరణ ఇచ్చారు.
కట్ చేస్తే కాలం వేగంగా ముందుకు వచ్చింది. రంగస్థలం సినిమా వచ్చి కూడా దాదాపు రెండేళ్లు దాటుతోంది. పైగా మైత్రీ నుంచి కూడా చాలా సినిమాలొస్తున్నాయి. కానీ అనుపమకు మాత్రం మళ్ళీ మైత్రి నుండి అవకాశం రాలేదు. ఆ మాటకొస్తే అనుపమ పేరు చాల సినిమాల్లో గట్టిగా వినిపిస్తోంది గాని, చివరకు వచ్చే సరికి.. ఆయా సినిమాల నటీనటుల లిస్ట్ లో అనుపమ ఉండటం లేదు.
నిజానికి ‘వకీల్ సాబ్’ సినిమాలో నివేదా థామస్ పాత్ర మొదట అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వెళ్ళింది. ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ తరువాత డేట్స్ కుదరక అనుపమ ఈ సినిమాని వదులుకుంది అని వార్తలు వచ్చాయి. మళ్ళీ కట్ చేస్తే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ మాత్రమే హైలైట్ అవుతాడు అనుకుంటే.. నివేదా థామస్ పాత్ర కూడా హైలైట్ అయింది.
మొత్తానికి పై రెండు సినిమాలు అనుపమ పరమేశ్వరన్ చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. అయితే ‘అనుపమ’ది చిన్నపిల్లల మనస్తత్వం అట. తెలిసి తెలియక ఆమె తన సినిమాల సెలక్షన్ తో కెరీర్ ను నాశనం చేసుకుంటుంది అని ఆమె గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. పాపం అనుపమ ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు కూడా ఎక్కువుగా లేవు.