spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan : ముందస్తు ఎన్నికలు, కేబినెట్ మార్పులపై సీఎం జగన్ క్లారిటీ

CM Jagan : ముందస్తు ఎన్నికలు, కేబినెట్ మార్పులపై సీఎం జగన్ క్లారిటీ



CM Jagan :
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలు జగన్ సర్కారు ముందస్తుకు వెళ్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై పలు రకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో ఆశావహులకు నిరాశే మిగులుతోంది. మంత్రివర్గ మార్పులపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. అందుకే ఐదేళ్లు పాలించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఏం జరుగుతోంది?

మరోవైపు ఏపీలో ఏం జరుగుతోంది? రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పార్టీల చూపు ఎటు వైపు వెళ్తోంది? అనే విషయాలు ప్రజలకు అర్థం కావడం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ప్రజలకు బాగుంటున్నా కొన్నింటిపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమే కానుందా? అనే కోణంలో పలు వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళతారా? ముందస్తుతో జగన్ కు లాభం కలుగుతుందా? అనే విషయంలో వైసీపీ ఆలోచన కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఉండదని చెప్పారు. మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.

స్పష్టత ఇచ్చిన జగన్

ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని జగన్ మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం పూర్తి కాలం మనుగడలో ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు అస్కారం లేదు. ముందస్తుకు వెళ్లేది లేదు. ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవ చేయడమే లక్ష్యం. తరువాతే ఎన్నికలు అని కుండ బద్దలు కొట్టారు. ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ముందస్తు ఆలోచన లేదని వెల్లడించారు. కొద్ది రోజులుగా జగన ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారానికి తెర దించారు.

ముందస్తుతోనే జగన్ కు లాభమా?

ఇటీవల జరిపిన కొన్ని సర్వేల్లో జగన్ ముందస్తుకు వెళితేనే గెలుస్తారని చెబుతున్నాయి. 2024లో ఎన్నికలకు వెళితే టీడీపీకే ప్లస్ అవుతుందని వెల్లడించాయి. కానీ జగన్ మాత్రం ముందస్తుకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తాయని చెబుతున్నాయి. 2024లో ఎన్నికలు జరిగితే టీడీపీకి 46 శాతం, వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని తెలుస్తోంది. జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version