Paddy Issue: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ధాన్యం కొనుగోలు అంశం ప్రస్తుతం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెబుతుంటే కొనాలని రాష్ట్రం డిమాండ్ చేస్తూ ధర్నా చేసినా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. తమ ధాన్యం ఎవరు కొంటారో తెలియడం లేదు. ఓ పక్క పంట చేతికొచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం తెరుచుకోలేదు. ఈ క్రమంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్ని అభిప్రాయ భేదాలు ఇప్పుడు రైతుల నడ్డి విరిచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. మద్దతు ధర దేవుడెరుగు కానీ ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసేదెవరని ప్రశ్నలు వస్తున్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందనే వాదనలు వస్తున్నాయి. రైతుల పంట ఎలా అమ్ముడవుతుందని అసంతృ్ప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nani’s: ఆ ఇద్దరు చేసిన తప్పెంటీ.. వైసీపీలో ఇదే చర్చ..!
గత కొంత కాలంగా రాష్ర్ట ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని మరపట్టించిన తరువాత రాష్ట్రం దగ్గర కావాల్సినంత ఉంచుకుని మిగతా బియ్యాన్ని కేంద్రానికి అందజేస్తుంది. దీంతో ఆ బియ్యాన్ని కేంద్రం ఎఫ్ సీఐకి పంపిస్తుంది. అయితే ఎఫ్ సీఐ వద్ద ఇప్పటికే నిల్వలు పేరుకుపోవడంతో ఇక బియ్యం అవసరం లేదని కేంద్రం చెబుతోంది. కానీ రాష్ట్రం మాత్రం బియ్యం తీసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో వడ్ల కొనుగోలు సందిగ్ధంలో పడింది.
తెలంగాణ రైతాంగం సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణలో కొద్దిరోజుల్లో వరికోతలు ప్రారంభం కావడంతో సమస్య ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రైతులు పావులుగా మారుతున్నారా? ధాన్యం కొనుగోలు అంశాన్ని తేల్చకుండా నాన్చుతుండటంతో ఎలాంటి మార్పులు వస్తాయో అంతుబట్టడం లేదు. వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు సమస్య వచ్చిపడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దానిపైనే అందరి దృష్టి పడింది.
Also Read:Kodali Nani: కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి?