Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ రోజు రోజుకూ యమ రంజుగా మారుతోంది. గతంలో కంటే చాలా భిన్నమైన టాస్క్ లు, కాంట్రవర్సీ లతో ఫుల్ రేటింగ్ తెచ్చుకుంటుంది. ఈసారి ఎక్కువ బూతుపురాణం కనిపిస్తోంది. బిగ్ బాస్ ఈసారి కావాలనే కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఏరికోరి మరీ ఎవరెవరికి పడదో వారి మధ్య టాస్క్ లు పెడుతూ నానా గొడవ జరిగేలా చేస్తున్నాడు.

ఈ సీజన్ లో ఇప్పటికే ఆరు వారాలు కంప్లీట్ అయిపోయాయి. గడిచిన వారాల్లో తేజస్వి, సరయు, ఆర్జే చైతు, స్రవంతిలు ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వారిలో కాంట్రవర్సీ యాంకర్ శివ కూడా ఉన్నాడు. మొదటి నుంచి అతనికి నటరాజ్ మాస్టర్ కు అస్సలు పడట్లేదు. వీరిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు.
Also Read: Prashanth Neel- Rajamouli: రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్
ఇక తాజాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో నట్రాజ్ మాస్టర్ శివపై మరోసారి రెచ్చిపోయి దారుణమైన కామెంట్లు చేశాడు. ఈసారి నామినేషన్ టాస్క్ ను విభిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఇద్దరూ జంటగా వచ్చి డిబేట్ పెట్టుకుని ఒకరు నామినేట్ అయ్యేలా మాట్లాడుకోవాలి. అయితే కుర్చీలో కూర్చుని వీరు మాట్లాడుతున్న అంతసేపు వారిపై బురద పడుతుంది.

ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఎవరెవరికి పడదో వారిని ఏరికోరి మరీ జంటగా చేశాడు. ఇంకేముంది నటరాజ్ మాస్టర్ యాంకర్ శివ జంట అయిపోయారు. ఇద్దరు డిబేట్ పెట్టుకుని ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ నీలాగా నేను ఒకరిని అడ్డంపెట్టుకుని ఆడలేదని, నువ్వు ఒకరిని అడ్డంపెట్టుకుని ఆడుతావు అంటూ శివపై రెచ్చిపోయాడు. నేను నీలాగా బెడ్ మీద కూర్చుని ఉండను అని నువ్వు దొంగవి లేజి ఫెలో అంటూ బూతులు తిట్టాడు నటరాజ్ మాస్టర్. దానికి శివ కూడా గట్టిగానే కౌంటర్ వేస్తున్నాడు.

అయితే శివ మాట్లాడుతున్న క్రమంలోనే నట రాజ్ మాస్టర్ కల్పించుకొని నువ్వు బయట ఉన్న సెలబ్రిటీలను అడ్డంపెట్టుకుని గేమ్ ఆడుతున్నావని, బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు వారితో గూడుపుఠాని చేసుకున్నావ్ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అతని మాటలకు అందరూ షాక్ అయిపోయారు. అయితే శివ కూడా అతనికి గట్టిగానే కౌంటర్ వేస్తూ ఏమాత్రం తగ్గకపోవడంతో.. ఈవారం వీరిద్దరిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు.
Also Read:Naga Chaitanya: నాగ చైతన్య కి చుక్కలు చూపించిన హైదరాబాద్ పోలీసులు
[…] Also Read: Bigg Boss Telugu OTT: సెలబ్రిటీలతో అలాంటి నీచమైన ప… […]
[…] Yash: మోస్ట్ అవెయిటెడ్ మూవీగా వస్తున్న కేజీఎఫ్-2 మీద ఉన్న అంచనాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆకాశమే హద్దు అన్నట్లు ఎక్కడ చూసినా ఇప్పుడు కేజీఎఫ్-2 గురించే చర్చించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న సీక్వెల్ మూవీ కూడా ఇదే. అందుకే దాన్ని తెలుగులో కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. […]