Homeజాతీయ వార్తలుఆర్.ఎస్‌ ప్ర‌వీణ్ కుమార్ తో.. కేసీఆర్ కు చెడిందా?

ఆర్.ఎస్‌ ప్ర‌వీణ్ కుమార్ తో.. కేసీఆర్ కు చెడిందా?

తెలంగాణ రాష్ట్ర సోష‌ల్ వెల్ఫేర్ గురుకులాల కార్య‌ద‌ర్శి, ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేయ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం రేకెత్తించింది. గ‌తంలో గురుకులాల్లో చ‌దువు అంటే.. స‌ర్కారు బ‌డికి సెకండ్ వెర్ష‌న్ గా భావించే ప‌రిస్థితి నుంచి.. గురుకులాల్లోనే చ‌ద‌వాలని పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు కోరుకునే ప‌రిస్థితిని తేవ‌డంలో ప్ర‌వీణ్ కుమార్ పాత్ర అమోఘ‌మైన‌ది. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్న ఆయన.. అర్ధంత‌రంగా ఉద్యోగాన్ని వ‌దిలేయ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది చాలా మందికి అర్థం కాలేదు. అయితే.. తాజా ప‌రిణామం ఒక‌టి స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా దీన్నిప్రారంభించ‌బోతున్నారు. అయితే.. ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై చ‌ర్చించేందుకు ఈ నెల 26న సీఎం ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌ద‌స్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రగ‌నున్న‌ ఈ స‌మావేశంలో.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారితోపాటు ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం 412 మంది ఈ చ‌ర్చ‌లో పాల్గొన‌బోతున్నారు. ఇప్ప‌టికే అంద‌రికీ ఆహ్వానాలు కూడా అందాయి. అయితే.. ఈ జాబితాలో ప్ర‌వీణ్ కుమార్ పేరు లేదట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ద‌ళిత బంధు చ‌ర్చ‌ల‌కు త‌న‌కు ఆహ్వానం లేదు అని తెలిపారు. దీంతో.. కేసీఆర్ – ప్ర‌వీణ్ కుమార్ మ‌ధ్య గ‌ట్టిగానే విభేదాలు వ‌చ్చాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు.. ఆయ‌న రాజీనామా చేయ‌డానికి ఇదే కార‌ణం కావొచ్చా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది.

త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన త‌ర్వాత రాజ‌కీయాల‌పై ప్ర‌వీణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బ‌హుజ‌నుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆయ‌న‌.. సంప‌ద మొత్తం ఒక్క శాతం మంది వ‌ద్ద‌నే కేంద్రీకృత‌మైంద‌ని అన్నారు. మిగిలిన 99 శాతం మందికి తాయిలాలు వేస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ‘ద‌ళిత బంధు’ చ‌ర్చ‌ల‌కు ప్రవీణ్ కుమార్ ను పిలవకపోడంతో వివాదం పెద్దదే అనే చర్చ సాగుతోంది. మరి, 26వ తేదీ చర్చ తర్వాత.. ప్రవీణ్ కుమార్ ఈ పథకంపై ఎలాంటి కామెంట్లు చేస్తారన్నది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version