సినిమాల్లో హీరోలు ప్రకృతి గురించి.. వ్యవసాయం, రైతుల గురించి గొప్పగా చెబుతారు. సీన్లలో రైతుగా మారి ఇరగదీస్తారు. కానీ నిజంగా ఆ వ్యవసాయంపై ప్రేమతో సాగు చేసే వారు చాలా తక్కువమంది..
తెలుగులో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ లాంటి వారు ఫాంహౌస్ లు కట్టుకొని నిజంగానే వ్యవసాయం చేస్తున్నారు. తాజాగా మరో నటుడు కూడా కోవిడ్ కల్లోలంలో సినిమా అవకాశాలు తగ్గిపోయి సొంతూరుకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నాడు. రైతుగా మారి అతడు చేస్తున్న పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మూతపడడంతో అవకాశాలు లేక ఓ నటుడు రైతుగా మారాడు. బాలీవుడ్ నటుడు ఆశిష్ శర్మ తాజాగా ముంబైని వీడాడు. రాజస్థాన్ లో వ్యవసాయం చేసుకుంటూ రైతుగా మారి ప్రశాంత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
‘మోడీ: జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు నటుడు ఆశిష్ శర్మ. ‘సియా కే రామ్’ సీరియల్ తో పాపులర్ అయ్యాడు. కోవిడ్ మూలంగా సినిమా ఇండస్ట్రీ మూతపడడంతో ముంబై నుంచి స్వస్థలం రాజ్ స్థాన్ కు వెళ్లిపోయాడు. ఆయన ఊళ్లో 40 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. తనకు సినిమాల కంటే ఇదే లైఫ్ ఆనందంగా ఉందని ఆశిష్ శర్మ చెప్పడం విశేషం.