Homeఅప్పటి ముచ్చట్లుఆమె.. పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం.. ఆరాధించే అపురూపం !

ఆమె.. పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం.. ఆరాధించే అపురూపం !

Senior Actress Srividyaఆమె రూపం పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం ఆరాధించే అపురూపం. ఆ రోజుల్లో అంటే ముప్పై ఐదేళ్ల క్రితం.. ఆమె సినిమాల కోసం అప్పటి ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూలో ఉండేవారు. నిజానికి ఆమె పెద్ద హీరోయిన్ కాదు. కానీ, ఎందుకో తెలియదు, ఆమె కనబడగానే ఫ్రేమ్ లో అతిలోక సుందరి ఉన్న ప్రేక్షకుడి చూపు మాత్రం ఆమె వైపే వెళ్ళేది.

ఆమె ఒక్క భాషకే పరిమితం అవ్వలేదు. మలయాళం, తమిళ్‌ దగ్గర నుండి తెలుగు, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో ఆమె తన హోమ్లీ లుక్స్ తో అప్పటి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. సుమారు 800కు పైగా సినిమాలు.. పైగా ఆ అలనాటి అందాల తార చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా నటించిన సినిమాలలో ఎన్నో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.

ఓ దశలో అప్పటి స్టార్ హీరోయిన్స్ కంటే.. ఎక్కువ పాపులారిటీ సాధించింది. కానీ సపోర్టింగ్‌ రోల్స్‌ తోనే ఆమె సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తనకు అవకాశాలు వస్తున్నాయి అని ఆమె దిగులు చెందలేదు, తనకు వచ్చిన అక్కా చెల్లి, అమ్మ పాత్రలతోనే ప్రేక్షక లోకాన్ని తన మైకంలో కట్టి పడేసింది.

ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు, ఆమె కనబర్చే హావభావాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే భారతీయ వెండితెర పై ఎమోషనల్‌ యాక్ట్రెస్‌ గా ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పటికి ఆమెకు ఆ ముద్ర అలాగే ఉండిపోవడం కచ్చితంగా ఆమెకు దక్కిన గౌరవం. ఇక తన నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో కూడా ఆమె ఎంతగానో రంజింప చేశారు.

కానీ, ఆమె జీవితం భావితరాలకు ఓ గుణపాఠం, ఆమె ఓటమి వర్ధమాన తారలకు ఓ పాఠం. ఆమె ఎంతో గొప్ప మల్టీటాలెంటెడ్‌ అయినప్పటికీ ఎందుకు ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది ? కెరీర్‌ తొలినాళ్లలో కమల్‌ హాసన్‌ తో నటించడమే ఆమె చేసుకున్న పాపమా ?. కమల్‌ ప్రేమలో ఆమె పూర్తిగా కూరుకుపోయింది.

ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జార్జ్‌ థామస్‌ తో ప్రేమ వివాహం.. కొన్నాళ్లకు విడాకులు.. మళ్ళీ వెంటనే మలయాళ దర్శకుడు భరతన్‌ తో ప్రేమాయణం.. ఆ ప్రేమ మత్తులో భరతన్‌ ఆమె ఆస్తులు కాజేసి మోసం చేశాడు. ఇలా మొదటి నుండి ఆమె జీవితం ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.

ఎందరు తనను విమర్శిస్తున్నా ఎప్పుడు ఆమె భయపడలేదు, దేనికి ఆమె బాధ పడలేదు. కానీ క్యాన్సర్‌ ఆమెను కబలించింది. అయితే ఏం.. తన మొత్తం ఆస్తిని సేవా కార్యక్రమాలకు ఇచ్చేసి శాశ్వతంగా వెండితెర పై ఎమోషనల్ మహారాణిలా నిలిచిపోయింది. ఇంతకీ ఎవరామె.. ఆమె.. సీనియర్‌ నటి శ్రీవిద్య.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version