spot_img
Homeజాతీయ వార్తలుCJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని కోరుతున్నారు. కానీ తెరవెనక జరుగుతున్న అసలు వ్యవహారం వేరే ఉంది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టాలి.. దేశాన్ని అస్థిరపరచాలి అనేదే వారి సిద్ధాంతం. అందువల్లే ఈ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు. యువకులను రెచ్చగొట్టి రాక్షసానందం పొందుతున్నారు.

అప్పట్లో రైతు ఉద్యమం జరిగినప్పుడు మొదట్లో ఇదంతా కూడా కర్షకుల్లో రేకెత్తిన చైతన్యం అని అందరు అనుకున్నారు. కానీ దాని వెనక ఉన్న శక్తులు వేరని తర్వాత తేలింది. దీంతో ఈ సమస్యను మరింత పొడిగించుకుంటూ పోతే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని భావించిన కేంద్రం.. వెంటనే చట్టాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత రైతు ఉద్యమాలు జరగలేదు.. రైతులు చట్టాల గురించి మాట్లాడలేదు. వాస్తవానికి ఈ చట్టాల వల్ల జరిగే నష్టం కంటే మేలు ఎక్కువ. కానీ కొన్ని ప్రతీప శక్తులు రైతులను వాడుకున్నాయి. చివరికి వారిని బలి పశువులను చేశాయి.. ఈ వ్యవహారంలో ఖలిస్థానీ శక్తులు తెరమీదకి రావడంతో అసలు ఉద్దేశం ఏమిటో ఈ దేశ ప్రజలకు అర్థమైంది.

ఇప్పుడు నీట్ విద్యార్థులు కదం తొక్కడం వెనక కూడా ఖలిస్థానీ శక్తుల కుట్ర ఉందని బిజెపి ఆరోపిస్తోంది. ఆగస్టు 15 వరకు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగిస్తే ఏకంగా 10 కోట్లు ఇస్తానని ఖలిస్థానీ నేత గురుపంత్వంత్ సింగ్ పన్నూ చెప్పారు. ఈ వీడియోను భారత జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే బయటపెట్టారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.. “కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లతో గురుపంత్వంత్ జూమ్ కాల్ లో మాట్లాడాడు. వారితో చర్చలు జరిపాడు. పది కోట్లు ఇస్తానని చెప్పాడు. మోడీ పతనం సరిపోదని అందులో చెప్పాడు. ఇండియా ముక్కలు కావడమే పరిష్కారమని అందులో అన్నాడు. దీని వెనక కుట్ర ఉంది. ఇప్పుడు చెప్పండి ఇది ఏ తరహా ఆందోళన.. దీనికి ఎవరు సమాధానం చెప్తారని” నిషికాంత్ వ్యాఖ్యానించారు. నిషికాంత్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోలు బిజెపి నేతలు విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ వీడియోతో సీజేపీ నాయకులు డిఫెన్స్ లో పడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper