https://oktelugu.com/

Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటి

Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ ప్రముఖులు భేటి అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లు సహా అన్ని విషయాలను ప్రముఖులు జగన్ కు వివరించనున్నారు. జీవోనంబర్ 35లో సవరణలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2022 / 01:31 PM IST
    Follow us on

    Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ ప్రముఖులు భేటి అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు.

    చిత్ర పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లు సహా అన్ని విషయాలను ప్రముఖులు జగన్ కు వివరించనున్నారు. జీవోనంబర్ 35లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు, సినిమా టికెట్ ధరల పెంపు, ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ట టికెట్ ధరల పెంపు, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో ఆహార పదార్తాల ధరలపై వీరంతా సీఎం జగన్ తో చర్చించనున్నారు.

    థియేటర్ల వర్గీకరణ, ధరల పెంపుపై ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటికే నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు టాలీవుడ్ సమస్యలపై జగన్ తెరదించే అవకాశాలున్నాయి.

    తెలంగాణలో కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయడం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన తరుణంలో ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటిపైనే ఉంది. ఈ సమావేశంతో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని టాలీవుడ్ ఎంతో ఆశతో ఉంది.

    హైదరాబాద్ నుంచి బయలు దేరే ముందు సీఎం జగన్ తో భేటికి ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి అన్నారు. కానీ టాలీవుడ్ ప్రముఖులు అంతా ఒకే విమానంలో ప్రయాణించారని తర్వాత తెలిసింది. విమానంలో మహేష్ బాబు పెళ్లి రోజు సందర్భంగా చిరంజీవి బొకే ఇచ్చి విషెస్ చెబుతున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ విషయం బయటపడింది.