Chiranjeevi: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ పెళ్లి రోజు నేడు. కాగా ఈ లవ్లీ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రియమైన, అందమైన జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ప్రేమ, సంతోషాలతో జీవితాంతం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. పైగా మహేష్ కి పెళ్లి కానుక కూడా చిరు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగూ మహేష్ సీఎంను కలిసేందుకు తాడేపల్లికి వెళ్తుండగా విమానంలో మహేష్ ను కలిసిన చిరంజీవి సూపర్ స్టార్ కి పుష్పగుచ్ఛం అందజేశారు.

అన్నట్టు ఈ రోజుతో మహేశ్ బాబు, నమ్రత వివాహ బంధానికి 17ఏండ్లు పూర్తయ్యాయి. ఇక పెళ్లి రోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అప్పుడే 17 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. ఇలాంటివి మరిన్ని జరుపుకోవాలి. ఇదంతా ప్రేమతో’ అని తన భార్య నమ్రతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మొత్తానికి మహేష్ పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: ఇంట్లో తాబేలు బొమ్మ ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టాలి?
పైగా మహేష్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన కథానాయకుడి పెళ్లి రోజును ఘనంగా జరువుతున్నారు. కొంతమంది అభిమానులు అయితే.. మహేష్ – నమ్రత పేర్ల మీద ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నారు. కాగా మహేష్ బాబు పోస్ట్ చేసిన పోస్ట్ కి నమ్రత సమాధానం ఇస్తూ.. ‘మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. మా ప్రేమలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇది జీవితాంతం కొనసాగుతుంది’ అని నమ్రత పోస్టు చేసింది.

ఏది ఏమైనా ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని నిరూపించిన ఈ జంట ఇలాగే హ్యాపీగా కలకాలం ఉండాలని ఆశిస్తూ మహేష్ – నమ్రత దంపతులకు ప్రత్యేక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా ఓకే తెలుగు.కామ్.
Also Read: కాలికి, నడుముకు నల్ల దారం కట్టుకోవడం వెనక అసలు కారణం ఇదే..!