https://oktelugu.com/

Abbas: శంక‌ర్ ఆఫ‌ర్ ఇస్తే వ‌ద్ద‌న్న అబ్బాస్‌.. బ్లాక్ బ‌స్టర్ మిస్ చేసుకున్నాడే..!

Abbas: సంచ‌ల‌న డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాలు ఎంత డిఫ‌రెంట్ గా ఉంటాయో.. అంత అడ్వాన్స్ గా ఉంటాయి. అందుకే ఆయ‌న సినిమా చేద్దామంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే ఆయ‌న డైరెక్ష‌న్లో ఒక్క సినిమా చేసినా స్టార్ డ‌మ్ పెరుగుతుంద‌ని భావిస్తుంటారు సినీ హీరోలు. అయితే ఆయ‌న డైరెక్ష‌న్ లో జీన్స్ సినిమాను తీద్దామ‌ను కున్నాడు. ఒకే పోలిక‌లు ఉన్న ఇద్ద‌రు కుర్రాళ్లు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 10, 2022 / 01:42 PM IST
    Follow us on

    Abbas: సంచ‌ల‌న డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాలు ఎంత డిఫ‌రెంట్ గా ఉంటాయో.. అంత అడ్వాన్స్ గా ఉంటాయి. అందుకే ఆయ‌న సినిమా చేద్దామంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే ఆయ‌న డైరెక్ష‌న్లో ఒక్క సినిమా చేసినా స్టార్ డ‌మ్ పెరుగుతుంద‌ని భావిస్తుంటారు సినీ హీరోలు. అయితే ఆయ‌న డైరెక్ష‌న్ లో జీన్స్ సినిమాను తీద్దామ‌ను కున్నాడు. ఒకే పోలిక‌లు ఉన్న ఇద్ద‌రు కుర్రాళ్లు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తెర‌కెక్కించాడు.

    Abbas

    అయితే ఈ సినిమాను ముందుగా హీరో అబ్బాస్‌‌తో చేద్దామ‌ని శంక‌ర్ అనుకున్నారంట‌. ఆయ‌న అయితే బాగుంటుంద‌ని సీన్ చెప్దామ‌ని శంక‌ర్ అనుకున్నారంట‌. కాగా అప్ప‌టికే ప్రేమదేశం సినిమా పెద్ద హిట్ కావ‌డంతో అబ్బాస్ బాగా బిజీగా అయిపోయాడంట‌. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఏకంగా ప‌ది సినిమాల‌ను లైన్ లో పెట్టుకున్నాడంట‌.

    Also Read: మహేష్ కి ఆమె పై అంత ప్రేమ ఉందా ?

    కాగా అదే స‌మ‌యంలో శంక‌ర్ పిలిచి అడ‌గ్గా.. తాను ఆల్రెడీ సినిమాల‌కు ఓకే చెప్పేయ‌డంతో.. ఈ సినిమాను చేయ‌డానికి డేట్లు స‌రిపోక చివ‌ర‌కు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంట‌. అయితే ఇదే క‌థ‌ను అజిత్‌కు వినిపించాడంట శంక‌ర్‌. కానీ డేట్లు అడ్జ‌స్ట్ కాక అజిత్ కూడా త‌ప్పుకున్నాడంట‌. ఇక ఆఖ‌ర‌కు ప్రశాంత్ ను అడిగాడంట శంక‌ర్‌.

    Shankar

    అప్ప‌టికే ప్రేమికుడు, ప్రేమదేశం లాంటి బంప‌ర్ హిట్ మూవీల‌ను కాద‌నుకుని బాధ‌ప‌డుతున్నాడు ప్ర‌శాంత్‌. దీంతో శంక‌ర్ రూపంలో వ‌చ్చిన అదృష్టాన్ని ఒడిసిప‌ట్టుకున్నాడు. అయితే ప్ర‌శాంత్ కూడా అప్ప‌టికే ఏడు సినిమాల‌ను లైన్లో పెట్టుకున్నా స‌రే.. వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టేసి శంక‌ర్ మూవీకి ఓకే చెప్పాడు. దీంతో ఐశ్వ‌ర్య రాయ్‌ను హీరోయిన్ గా పెట్టి ఈ మూవీని తీశాడు శంక‌ర్‌.

    అయితే విడుద‌ల‌య్యాక దీని రిజ‌ల్ట్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పట్లో ఇదో విజువ‌ల్ వండ‌ర్ లా అనిపించింది. అన్ని భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత అబ్బాస్ చాలా ఫీల్ అయ్యారంట‌. అన‌వ‌స‌రంగా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాన‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోయారంట‌.

    Also Read:  ఇంట్లో తాబేలు బొమ్మ ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టాలి?

    Tags