వైసీపీపై సెటైర్లు వేసి.. అడ్డంగా బుక్కయిన లోకేష్..!

‘తొందరపడి ఓ కోయిలా.. ముందే కూసింది.. చిందులు వేసింది..’ అన్నట్టుగా లోకేష్ తీరు మారిపోయింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఎలాగైతే ముందు వెనుక ఆలోచించుకుండా మాట్లాడుతూ అబాసుపాలవుతుండటం చూస్తునే ఉన్నాం.. ఇక ఆయన తనయుడు లోకేష్ సైతం వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టాలనే తొందర్లో నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్లు పెడుతూ విమర్శల పాలవుతున్నారు. ఇటీవల వైసీపీ సర్కార్ ను ఉద్దేశిస్తూ లోకేష్ బాబు తన ట్వీటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకోకుండానే విలేకరిపై […]

Written By: NARESH, Updated On : September 1, 2020 1:16 pm
Follow us on

‘తొందరపడి ఓ కోయిలా.. ముందే కూసింది.. చిందులు వేసింది..’ అన్నట్టుగా లోకేష్ తీరు మారిపోయింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఎలాగైతే ముందు వెనుక ఆలోచించుకుండా మాట్లాడుతూ అబాసుపాలవుతుండటం చూస్తునే ఉన్నాం.. ఇక ఆయన తనయుడు లోకేష్ సైతం వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టాలనే తొందర్లో నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్లు పెడుతూ విమర్శల పాలవుతున్నారు.

ఇటీవల వైసీపీ సర్కార్ ను ఉద్దేశిస్తూ లోకేష్ బాబు తన ట్వీటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకోకుండానే విలేకరిపై వైసీపీ గుండాల దాడి అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో వైసీపీకి సంబంధం లేదని తేల్చారు. పోలీసులు లోకేష్ గుట్టురట్టు చేయడంతో ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టగా అది చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తేలింది. జిల్లాలోని ఓ హెడ్మాస్టర్ ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఓ విలేకరిలో ఇందులో కలుగజేసుకున్నాడట. సదరు హెడ్మాష్టర్ ను కేసు నుంచి తప్పించేందుకు బాలిక తల్లిపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడట. దీంతో బాలిక తరుపు బంధువులు సదరు విలేకరిపై దాడికి యత్నించారు. ఈ వీడియోనే లోకేష్ ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు విలేకరులపై దౌర్జన్యాలు అంటూ రెచ్చిపోయి ట్వీట్లు చేశారు. తీరా పోలీసులు అసలు విషయం బయటపెట్టడంతో లోకేష్ ఖంగుతినాల్సి వచ్చింది.

దీంతో వైసీపీ నేతలు లోకేష్ బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్దాలు.. అసత్యాలు ప్రచారం చేయడంలో లోకేష్ బాబు చంద్రబాబునే మించిపోతున్నారంటూ సైటర్లు వేస్తున్నారు. లోకేష్ రాజకీయంగా ఎదగాలంటే చంద్రబాబులా కాకుండా నిర్మాణాత్మక విమర్శలు చేయాలని లేకుండా చంద్రబాబుకు పట్టిన గతే లోకేష్ కు పడుతుందంటూ హెచ్చరించారు. తండ్రికొడుకులు రాష్ట్రానికి పట్టిన శాపమంటూ ఓ రేంజులో ఫైరవుతున్నారు. తప్పు తెలుసుకున్న లోకేష్ ప్రస్తుతానికి సైలంటయ్యారు. ఇకనైనా లోకేష్ బాబు నిజనిజాలు తెలుసుకొని ట్వీట్లు చేస్తాడో లేక మళ్లీ అదే దారిలో వెళ్లి విమర్శల పాలవుతారో వేచిచూడాల్సిందే..!