https://oktelugu.com/

ఊపిరిలూదిన చిరంజీవి.. ఆక్సిజన్ బ్యాంకులు

  కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసుల కంటే మరణాలే అత్యధికంగా నమోదై ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.అయితే వైరస్ తీవ్రతతో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఆక్సిజన్ ను ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. మరి కొందరు సినీ ప్రముఖులు అత్యవసరమున్నవారికి ఆక్సిజన్ ను అందిస్తున్నారు. వీరిలో సోనూసుద్ ఇప్పటికే మిస్డ్ కాల్ ఇవ్వండి ఆక్సిజన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2021 / 11:59 AM IST
    Follow us on

     

    కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసుల కంటే మరణాలే అత్యధికంగా నమోదై ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.అయితే వైరస్ తీవ్రతతో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఆక్సిజన్ ను ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. మరి కొందరు సినీ ప్రముఖులు అత్యవసరమున్నవారికి ఆక్సిజన్ ను అందిస్తున్నారు. వీరిలో సోనూసుద్ ఇప్పటికే మిస్డ్ కాల్ ఇవ్వండి ఆక్సిజన్ అందిస్తానని ప్రకటించారు. అయితే ఇదే కోవలో తెలుగు సినీ హీరో చిరంజీవి కూడా ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని కొన్ని పరిస్థితులను భట్టి చూస్తే అర్థమవుతోంది. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో ఆక్సిజన్ ఏర్పాటుకు ప్రభుత్వాలతో పాటు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కొన్సి స్వచ్ఛంద సంస్థలు సైతం ఆక్సిజన్ ను ఉచితంగా అందిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం గుంటూరు, అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రేపు కరీంనగర్, ఖమ్మంతో పాటు మరి కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వారంతంలోగా దాదాపు అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఒక్కో జిల్లాలో 100 ఆక్సిజన్ సిలిండర్లను సమకూరుస్తామని ఆ తరువాత అవసరమున్నవారికి సరఫరా చేస్తామని చిరంజీవి తెలిపారు..