Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Controversy With Star Heroes: విజయ్ దేవరకొండ విషయంలో స్టార్ హీరోలు సీరియస్...

Vijay Deverakonda Controversy With Star Heroes: విజయ్ దేవరకొండ విషయంలో స్టార్ హీరోలు సీరియస్ అయ్యారా..?

Vijay Deverakonda Controversy With Star Heroes: పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ దేవరకొండ… ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయన తీసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయిన కూడా ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన ‘కింగ్ డమ్’ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయిన కూడా అతని మార్కెట్ తగ్గలేదు. ప్రస్తుతం రౌడీ జనార్ధన్, రణబాలి అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు…విజయ్ దేవరకొండ గతంలో స్టార్ హీరోలను, వాళ్ళ ఫ్యామిలీ లను ఉద్దేశించి చాలా వరకు కామెంట్లు చేశాడు. ఇక ఆ సందర్భంలో స్టార్ హీరోలు అతని మీద కొంత వరకు సీరియస్ అయ్యారట. ఇక దాంతో పాటుగా ఆయనకి లైగర్, ఖుషీ, కింగ్ డమ్ లాంటి సినిమాలతో ఫ్లాపులు రావడంతో ఇప్పుడు తను కొంచెం తగ్గి ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

అప్పట్లో స్టేజి మీదకి ఎక్కితే చాలు మైక్ పట్టుకొని తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఆ పొగరు తగ్గిందని మరి కొంతమంది అంటున్నారు. మరి విజయ్ ఎందుకని అలా చేశాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ని కొంతమంది స్టార్ హీరోలు పర్సనల్ గా పిలిచి నువ్వు అలా బిహేవ్ చేస్తే నీ కెరియర్ కే ప్రమాదం రావచ్చు అని చెప్పారట. దానివల్లే ఆయన కొంచెం తగ్గి ఉంటున్నట్టుగా తెలుస్తుంది… రీసెంట్ గా ఆయన రష్మిక మందాన ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరు ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో ఉన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట భారీ సక్సెస్ లను సాధిస్తేనే తను టైర్ వన్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను మరింత కోల్పోయే అవకాశమైతే ఉంది. కాబట్టి ఎలాంటి కాంట్రవర్షల్ కామెంట్స్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version