Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi Congress ID Card: చిరంజీవి జనసేన కాదు.. కాంగ్రెస్.. ఇదిగో ఫ్రూఫ్

Chiranjeevi Congress ID Card: చిరంజీవి జనసేన కాదు.. కాంగ్రెస్.. ఇదిగో ఫ్రూఫ్

Chiranjeevi Congress ID Card: మెగాస్టార్‌ చిరంజీవి తాను తీసిన గాడ్‌ఫాదర్‌ సినిమా దసరా తర్వాత విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ను చిరు మంగళవారం విడుదల చేశారు. ఇది ఇప్పుడు స్టేట్‌ పాలిటిక్స్‌తోపాటు నేషనల్‌ పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు చింజీవి డైలాగ్‌ ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నానుంచి దూరం కాలేదు’పై మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులోని అంతరార్ధాన్ని అన్వేశిస్తున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ చిరంజీవి తమ పార్టీ వ్యక్తే అనిపించుకోవడానికి హడావుడిగా గుర్తింపుకార్డు జారీ చేసింది. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

Chiranjeevi Congress ID Card
Chiranjeevi Congress ID Card

2027 వరకు చెల్లుబాటయ్యే కార్డు..

ప్రత్యక్ష రాజకీయాలకు చిరంజీవి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత కాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్నా సమావేశాలకూ వెళ్లలేదు. ఇందు కోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్‌ అనుమతిని తీసుకున్నారు. పదవీకాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్లలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవలే ప్రకటించారు. అయితే గాడ్‌ఫాదర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పొలిటికల్‌ డైలాగ్‌ను వదలడం.. అది వైరల్‌ అయింది. దీంతో మరుసటి రోజే ఏఐíసీసీ డెలిగేట్‌ కార్డు మీడియాకు విడుదల చేసింది. దీని కాలపరిమితి 2027 వరకు ఉండడం గమనార్హం.

వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్‌..
ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్న చిరంజీవికి.. పరిస్థితులు కలిసి రాలేదు. ఎన్నికల్లో భారీ విజయం లభించకపోవడంతో ఆయన వేగంగానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత కేంద్రమంత్రి అయ్యారు. కానీ ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న పరిణామాలు. రాష్ట్ర విభజన, జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వంటి కారణాలతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలహీనం అయిపోయింది. దీంతో చిరంజీవి కూడా కాపాడలేని పరిస్థితి. ఆ సమయంలో చిరంజీవి మళ్లీ తనకు అచ్చి వచ్చిన సినీమారంగంలోకి వెళ్లిపోయారు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు.

Chiranjeevi Congress ID Card
Chiranjeevi

ఏపీసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం..
కాంగ్రెస్‌ పార్టీకి ఏడాదికిపైగా జాతీయ అధ్యక్షుడు లేడు. సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎన్నికపై సోనియాగాంధీ దృష్టిపెట్టారు. ఈసారి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ ఉన్నారు. ఎన్నిక అనివార్యం అయ్యే అవకావం ఉండడంతో పార్టీ డెలిగేట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది ఈ డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు అక్టోబర్‌ 17న జరిగే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

కాంగ్రెస్‌ కార్డు జారీ చేయడంపై స్పందిస్తారా !?
పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పార్టీ పెట్టడం.. ఆయనకు చెక్‌ పెట్టేందుకు ఇతర పార్టీలు చిరంజీవిని తమకో కలుపుకోవాలని ప్రయత్నిస్తూండటంతో చిరంజీవి రాజకీయ అడుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించారు కానీ.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు. అలా చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ పార్టీలో ఉన్న ప్రస్తుత, మాజీ ఎంపీలు.. కేంద్రమంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్‌ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవికి కార్డు జారీ చేసినట్లు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. కానీ ఇది యాదృశ్చికం కాదని, చిరు పొలిటికల్‌ డైలాగ్‌ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధిష్టానం ఈ కార్డు విడుదల చేసిందని కొందరు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం అందరిలాగానే చిరంజీవికి కార్డు జారీ అయిందని చెబుతున్నారు. మరి దీనిపై మెగాస్టార్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular