https://oktelugu.com/

ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్‌‌ పిలుపు

ఏపీలో ఆలయాల మీద దాడులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలే స్పందించగా.. ఇటీవల స్వామిజీలూ మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో పోటాపోటీగా టెంపుల్‌ రన్‌ ప్రోగ్రామ్స్‌ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ముందుగా ఈ జాబితాలో స్వామిజీలు చేరుతున్నారు. Also Read: దేవుళ్లపై ఎందుకీ కోపం.. మళ్లీ విగ్రహాల ధ్వంసం తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత ఆత్మీయుడైన.. స్వామిజీగా పేరొందిన త్రిదండి చినజీయర్ స్వామి ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 / 02:55 PM IST
    Follow us on


    ఏపీలో ఆలయాల మీద దాడులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలే స్పందించగా.. ఇటీవల స్వామిజీలూ మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో పోటాపోటీగా టెంపుల్‌ రన్‌ ప్రోగ్రామ్స్‌ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ముందుగా ఈ జాబితాలో స్వామిజీలు చేరుతున్నారు.

    Also Read: దేవుళ్లపై ఎందుకీ కోపం.. మళ్లీ విగ్రహాల ధ్వంసం

    తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత ఆత్మీయుడైన.. స్వామిజీగా పేరొందిన త్రిదండి చినజీయర్ స్వామి ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాడులకు గురైన ఆలయాలన్నింటినీ చినజీయర్ స్వామి పరిశీలిస్తారని.. ఆలయాల పరిరక్షణకు ఆసక్తి ఉన్న వారందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే రామతీర్థం ఆలయంలో.. రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై చినజీయర్ ఘాటుగా స్పందించారు. వ్యవస్థలు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అందుకే.. ఆయన ఆలయాల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం జరిగింది. 150కిపైగా ఆలయాలు ధ్వంసం అయ్యాయని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆలయాలు అందులో కొన్నే ఉంటాయి. ఇక 30 ఆలయాల వరకూ అలాంటివి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చినజీయర్ వీటిని సందర్శించే అవకాశం ఉంది. ఒక్క రోజుతో ముగించకుండా.. ఓ యాత్రలా చేసేందుకు రెడీ అయిపోయినట్లుగా సమాచారం.

    Also Read: రూట్‌ మార్చిన టీడీపీ..: టార్గెట్‌ తిరుపతి

    ఇక చినజీయర్‌‌ స్వామి ఆలయాల యాత్ర చేస్తే..మిగితా స్వామిజీలు మాత్రం ఊరుకుంటారా..! ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఏమైనా చేసేందుకు స్వరూపానంద లాంటి స్వాములు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే స్వామిజీలు చాలా మంది ఉన్నారు. వారు కూడా యాత్రలు చేసే అవకాశం ఉంది. ఇక రాజకీయాలు కూడా ఇదేదో బాగుందనుకుని యాత్రలు ప్రారంభిస్తే.. టెంపుల్ రన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో సంక్షేమ పథకాలు సైడ్‌ అయిపోయి ఆలయాలు, చర్చిల మీదనే రచ్చ జరిగేలా ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్