హీరోయిన్ అంటే.. చాలామందికి చిన్న చూపు ఉంటుంది. గ్లామర్ ప్రపంచంలో విలువులు లేకుండా డబ్బు కోసం అడ్డమైన పనులతో నలిగిపోతూ ఉంటారని. కానీ, కొంతమంది హీరోయిన్స్ కి ఎంతో గొప్ప మనసు ఉంటుంది. సినిమాలలో వాళ్ళు వేసే పాత్రలకు నిజ జీవితంలో వారి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అసలు హీరోయిన్లకు… అనాథలను దత్తత తీసుకుని కన్నతల్లిలా వాళ్ళను పెంచే హృదయం ఉండటం అంటే మాటలా. ఈ విషయంలో చాలా మందే హీరోయిన్స్ ఉన్నారు. సుస్మితా సేన్, సన్నీలియోన్, హన్సిక.. వీళ్లంతా అనాథలను అడాప్ట్ చేసుకుని కన్నతల్లిలా పెంచుతున్న వాళ్లే.
Also Read: లెజెండరీ దర్శకుడి కోడలకి మళ్ళీ పెళ్లి !
దిక్కూమొక్కు లేని పిల్లలకు అన్ని తామై నిలవడానికి ఎంతో దైర్యం కావాలి. అసలుకే హీరోయిన్ల కెరీర్ గాలిలో దీపం లాంటిదని.. ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోతారో తెలియదు. పైగా హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్లకు పెద్దగా సంపాదన కూడా ఉండదు. కానీ, హీరోయిన్లు మాత్రం అనాధలను ఆదరిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన స్థితిలో కూడా, చాలా మంది హీరోయిన్లు, అనాధల పిల్లల కోసం తమ విలువైన టైం కేటాయిస్తున్నారు. పైగా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తీసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇలాంటి జాబితాలోనే చోటు సంపాదించింది ‘రవీనా టాండన్’. అసలు అప్పుడపుడే హీరోయిన్ గా ఎదుగుతున్న ‘రవీనా టాండన్’ తన 21వ యేటే ఇద్దరమ్మాయిలను దత్తత తీసుకుని, వాళ్ళకు తల్లిలా మారడం అంటే.. నిజంగా ఎంతటి గొప్ప విషయం. ఒకపక్క అప్పుడే బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగే క్రమం.. అలాంటి సమయంలో పిల్లలను దత్తత తీసుకుంటే.. లేనిపోని ఆరోపణలు.. పైగా ఆ పిల్లలు ఆమెకే పుట్టారు అని కూడా విమర్శలు చేశారు.
Also Read: ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..?
రవీనా అలాంటి విమర్శలు పట్టించుకోలేదు. ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నప్పుడు.. ఇలా నీకు పిల్లలు ఉంటే.. పెళ్లి కూడా కాదు అన్నారు. నీ మీద చెడు ప్రచారాలు చేస్తారు అన్నారు, చేశారు కూడా. అయినా, రవీనాకు మంచే జరిగింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి మహామహులే పోటీ పడ్డారట. చివరకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ఆమె పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్