https://oktelugu.com/

మిస్డ్ కాల్‌తో బ్యంక్ బ్యాలన్స్ తెలుసుకునే అవకాశం.. ఎలా అంటే..?

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. అలా బ్యాంక్ లు కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు తెచ్చిన సర్వీస్ లలో మిస్డ్ కాల్ సర్వీసులు కూడా ఒకటి. దేశంలో బ్యాంకులు ఒక్క మిస్ద్ కాల్ సహాయంలో సులభంగా బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. Also Read: రైల్వేస్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్.. ఎలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 5, 2021 / 03:01 PM IST
    Follow us on

    దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. అలా బ్యాంక్ లు కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు తెచ్చిన సర్వీస్ లలో మిస్డ్ కాల్ సర్వీసులు కూడా ఒకటి. దేశంలో బ్యాంకులు ఒక్క మిస్ద్ కాల్ సహాయంలో సులభంగా బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read: రైల్వేస్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 40 కోట్ల కంటే ఎక్కువమంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ అకౌంట్ ఉన్న కస్టమర్లు 9223766666 అనే నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సులభంగా బ్యాంక్ బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ కు సంబంధించిన సమాచారం మెసేజ్ రూపంలొ వస్తుంది. ఈ విధంగా ఎస్బీఐ ఖాతాదారులు సులభంగా బ్యాంక్ బ్యాలెన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వివరాలు లీక్..?

    అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కు రిజిష్టర్ చేసిన మొబైల్ నంబర్ నుండి కాల్ చేస్తే మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని వారు మెసేజ్ ను పంపడం ద్వారా మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి reg అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నంబర్ ను టైప్ చేసి 7208933148 అనే నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా సులభంగా రిజిష్టర్ చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    బ్యాంక్ అకౌంట్ లో బ్యాలన్స్ ఈ విధంగా ఎక్కడినుంచైనా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లు ఆయా బ్యాంకులకు సంబంధించిన నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సులభంగా బ్యాంక్ బ్యాలన్స్ ను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.