Xi Jinping: చైనాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు.. వారు చెప్పిందే ప్రపంచం తెలుసుకోవాలి. ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించినా విషం చిమ్ముతుంది. అధికారిక గ్లోబల్ టైమ్స్ ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తుంది. కరోనా వైరస్ ద్వారా ప్రపంచం మొత్తానికి తానే పెద్దన్న కావాలని.. ఒక రకాల కుయుక్తులకు పాల్పడిన చైనా.. ఇప్పుడు తానే సంక్షోభంలో చిక్కుకుంది. ఈ విషయం పక్కన పెడితే మొన్నటిదాకా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై రకరకాల వదంతులు వ్యాపించాయి. ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడుయిన ఆయన.. మూడోసారి కూడా అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సిపిసి జాతీయ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ చేయడంతో విశేషాధికారాలు జిన్ పింగ్ కు కట్టబెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇక ప్రధాని లీ కెకియాంగ్ సహా అనేక మందికి ఉద్వాసన పలికింది. దీంతోపాటు అవినీతి వ్యతిరేక విభాగానికి కొత్త బృందాన్ని నియమించింది.

రిటైర్మెంట్ వయసు దాటినప్పటికీ
డ్రాగన్ కు మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్ నియామకానికి చైనా కమ్యూనిస్టు పార్టీ శనివారం ఆమోదం తెలిపింది. పదేళ్ల పదవీకాలం, ఇన్ని సంవత్సరాల రిటర్మెంట్ వయసు దాటిపోయినప్పటికీ 69 సంవత్సరాల వయస్సు ఉన్న జిన్ పింగ్ మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఎన్నిక కావడం ఇక లాంఛనమే. ఐదేళ్లకు ఒకసారి వారం పాటు జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ నేషనల్ కాంగ్రెస్ శనివారం ముగిసింది. 205 మంది సభ్యులు, 171 మంది ప్రత్యామ్నాయ సభ్యులతో సెంట్రల్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. ఇందులో జిన్ పింగ్ కూ స్థానం కల్పించారు. సెంట్రల్ కమిటీ సమావేశం ఆదివారం జరగనుంది. ఆ సమావేశంలో 25 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంటారు. ఆ వెంటనే పొలిటికల్ బ్యూరో సమావేశమై ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది. అనంతరం స్టాండింగ్ కమిటీ సమావేశమై పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీకి , ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. స్థాని కమిటీ సమావేశం అనంతరం జిన్ పింగ్ తన కొత్త బృందంతో మీడియా ముందుకు వస్తారు.. బాగా ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ లో ఉన్న వారిలో సగం మందికి పైగా తప్పించునున్నట్టు తెలిసింది. పార్టీ అవినీతి వ్యతిరేక విభాగం సి సి డి ఐ సెంట్రల్ కమిషన్ ఫర్ డిస్ప్లే న్ ఇన్ స్పేక్షన్ కొత్త టీమును పార్టీ కాంగ్రెస్ నియమించింది. ఈ విభాగం నేరుగా జిన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
ప్రధాని అవుట్
పార్టీలో రెండో స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి లీ కేకియాంగ్ తో పాటు అత్యున్నత పదవుల్లో ఉన్న అనేకమంది పదవులు ఊడనున్నాయి. సెంట్రల్ కమిటీ కొత్త జాబితాలో లీ కేకీయాంగ్, ఉప ప్రధాని హాన్ జెంగ్ సహా అనేకమంది ప్రముఖుల పేర్లు గల్లంతయ్యాయి. విదేశాంగ మంత్రి వాంగ్ యీ రిటైర్మెంట్ వయసు దాటినప్పటికీ తిరిగి సెంట్రల్ కమిటీలోకి తీసుకోవడం గమనార్హం. పొలిటికల్ బ్యూరోలకి కూడా ఆయనను తీసుకునే అవకాశం ఉంది. జిన్ కు మరింత విస్తృత అధికారాలు కల్పించేలా రాజ్యాంగంలో సవరణలకు పార్టీ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఐదు సంవత్సరాలపాటు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారు. చలో జరిగే వార్షిక పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేస్తుంది.

ఇక పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు రాజ్యాంగ సవరణ చేస్తున్నట్టు జిన్ తెలపడం గమనార్హం.. ఇక తాజా నిర్ణయంతో నియంత లాంటి జిన్ కు సర్వ అధికారాలు సంక్రమిస్తాయి. ఆయనకు సలహా ఇచ్చే అవకాశం కూడా ఎవరికి ఉండదు. ఇక పార్టీ కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగానే చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో ను బయటకు అర్ధాంతరంగా తీసుకెళ్లి పోవడం కలకలం రేపింది. జిన్ పక్క సీటులోనే ఆయన కూర్చున్నారు. కొందరు యువకులు వచ్చి అతడిని బయటకు తీసుకెళ్తున్న వీడియోలు లీక్ అయ్యాయి. ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోయినందు వల్లే బయటకు తీసుకెళ్లాల్సి వచ్చిందని చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ సిన్ హువా ట్వీట్ చేసింది. అయితే ఈ సమావేశంలో జిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బలమైన గాలులు, ప్రమాదకరమైన తుఫానులు, ఎగిసిపడే కెరటాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు, దిగ్బంధనాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని జిన్ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు తావిస్తోంది.