JanaSena- YCP ministers: ఏపీలో జనసేనకు ఉన్న హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఏ పార్టీకి ఉండరు. రాజకీయాలు ఇష్టం లేని వారు సైతం పవన్ ను అభిమానించి అడుగులేస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి వెంట నడుస్తున్నారు. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలమవుతున్నా, చేతిలోకి పవర్ రాకపోయినా.. లేకపోయినా రోజురోజుకూ ఆ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పవన్ ను ఎవరైనా విమర్శించినా, తిట్టినా, దూషించినా బాధపడేవారు.ఎమోషనల్ అయ్యేవారు. కానీ ఎదైనా ఎక్స్ పీరియన్స్ తోనే తత్వం బోధపడుతుందంటారు. అందుకే ఇప్పుడు అటు జనసేనాని, ఇటు జన సైనికులు అసలు సిసలు రాజకీయం మొదలు పెట్టారు. అధికార వైసీపీకి కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం, వైసీపీ పాలకుల వైఫల్యాలపైబాగానే రియాక్టవుతున్నారు. అయితే ఈ క్రమంలో దాడులు, కేసులు ఉంటాయని.. తన వెంట నడేచేవారు ముళ్లు, రాళ్లూ రప్పలు దాటుకోవాల్సి ఉంటుందని పవన్ ముందుగానే హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే అధికార పక్షం యాక్షన్ ప్రారంభించింది.

మొన్న విశాఖలో జనసైనికుల కవాతు అటు అధికార పార్టీ గుండెల్లో రైలు పరుగెట్టించింది. అధికారంలో ఉండి, ఆంక్షలు పెడితే ఉత్తరాంధ్రలోని 37 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తే పది, పదిహేను వేల మందికి మించి రాలేదు. కానీ పవన్ పర్యటనకు మాత్రం పిలవకుండానే హాజరయ్యారు. ఇది ఎలాగబ్బ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. ‘వీడు ఎక్కడున్న రాజే’ అన్న బాహుబలి డైలాగు గుర్తు చేసుకున్నారో ఏమో.. విశాఖ ఎయిర్ పోర్టు ఎపిసోడ్ కు ప్లాన్ చేశారు. పక్కా వ్యూహంతో మంత్రులపై దాడిచేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని.. రకరకాల కారణాలు చూపుతూ పవన్ విశాఖ పర్యటనను అడ్డుకున్నారు. జనసైనికులు, వీర మహిళలపై సైతం కేసులు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అటు తరువాత పర్యవసానాలు జనసేన, వైసీపీ మధ్య జరిగిన యుద్ధ సీన్లు అందరికీ తెలిసినవే.

అయితే ఇప్పుడు అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గోడ దెబ్బ , చెంప దెబ్బ తగులుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ప్రజాప్రతనిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అటు నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయిన దానికి కానిదానికి పవన్ ను తక్కువచేసి మాట్లాడుతుండడాన్ని సహించలేకపోతున్నారు. బహిరంగంగానే తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. మరోవైపు జనసైనికుల నుంచి దాడులు ఉంటాయని సైతం నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ జాబితాలో ఏకంగా 13 మంది మంత్రులు ఉండడం విశేషం. పవన్ పై అనుచిత కామెంట్స్ చేసే మంత్రులు జాగ్రత్తగా ఉండాలని..కాన్వాయ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదంటూ నిఘా వర్గాల కీలక అధికారులు హెచ్చరికలు జారీచేశారు. పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. తనను కెలకొద్దని.. మరీ ఏరికోరి కెలికి కష్టాలు తెచ్చుకున్నారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. జనసైనికులతో పెట్టుకుంటే అట్టుంటది మరీ అన్నట్టు సాగుతోంది ఏపీలో యవ్వారం.