Xi Jinping Under House Arrest: ఉక్కు సంకెళ్లు.. నిగూఢమైన కమ్యూనిస్టు చైనా రాజ్యంలో ఏదో జరుగుతోంది. శాశ్వతంగా అధికారం చెలాయించాలి అనుకుని తనకు అనుకూలంగా సవరణలు చేసుకున్న జిన్ పింగ్ ఇప్పుడు కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. వాస్తవానికి అధికారం శాశ్వతం అనుకునే వాళ్ళకి ఎప్పటికప్పుడు కళ్ళు తెరిపించే ఘటనలు ప్రపంచంలో ప్రతి చోటా జరుగుతూనే ఉన్నాయి. నాటి హిట్లర్, ముస్సోలిని, వర్తమాన చరిత్రలో హిట్లర్, గడాఫీ, హుస్సేన్, ముషారఫ్, కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ఆ జాబితాలో జిన్ పింగ్ కూడా చేరుతున్నారు. చైనాలో ఆయన రాజ్యాంగ సవరణ కూడా చేసుకొని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అక్కడ వ్యతిరేకించడానికి, నిబంధనల గురించి చెప్పడానికి ఎన్నికల సంఘాల లాంటివి లేవు. జిన్ పింగ్ ఏదనుకుంటే అది జరుగుతుంది. అలాంటి జిన్ పింగ్ పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. జిన్ పింగ్ నయా నియంత. తనకు పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగితే మరణ శిక్షలు విధించేందుకు కూడా వెనుకాడరు. తన విధివిధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వేలకోట్ల సామ్రాజ్యాలనైనా కుప్పకూలిచేస్తారు. ఉదాహరణకు ఆలీబాబా గ్రూపు జాక్ మా నే తీసుకుంటే.. చైనాలో విధిస్తున్న కఠిన నిబంధనల వల్ల ప్రజలు బతికే పరిస్థితి లేదని, ఇలా అయితే ప్రపంచ స్థాయి దేశంగా ఎప్పుడు ఎదుగుతామని ఆయన ప్రశ్నించారు. ఫలితంగా ఆయన సామ్రాజ్యాన్ని అడుగు తొక్కేదాకా వదిలిపెట్టలేదు. ప్రస్తుతం ఆలీబాబా గ్రూప్ చాలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆలీబాబా గ్రూప్ అంటే చైనా సహా అన్ని దేశాల్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తనకు ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా నేలమట్టం చేసేదాకా జిన్ పింగ్ ఊరుకోడు. పేరుకు కమ్యూనిస్టు దేశం అయినప్పటికీ.. అక్కడ అమలవుతున్నవన్నీ ఫాసిస్టు విధానాలే.

ఎదురేలేదనుకున్నారు
చైనాలో మొన్నటిదాకా జిన్ పింగ్ కు ఎదురేలేదనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఇక్కడ ఏదో జరుగుతోందనే సంకేతాలు మాత్రం వినిపిస్తున్నాయి. జిన్ పింగ్ ను బీజింగ్ లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జిన్ పింగ్ ను పీపుల్స్ సెలబ్రేషన్ ఆర్మీ చీఫ్ గానూ తొలగించారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున విమానాల రద్దు, బీజింగ్ లో భారీ సైనిక బందోబస్తు వీటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ లో షాంగై కో_ అపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొని ప్రదేశానికి ఈనెల 16న తిరిగి వచ్చిన జిన్ పింగ్ ను విమానాశ్రయంలోనే పి ఎల్ ఎ అదుపులోకి తీసుకున్నదని.. అనంతరం గృహనిర్బంధం చేస్తుందని కథనాలు వస్తున్నాయి. ఈ అంశాలను ఉటంకిస్తూ బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేయడం మరింత సంచలనమైంది. అయితే వీటిని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ధ్రువీకరించలేదు. కానీ వివిధ మీడియా కథలను ప్రకారం జిన్ పింగ్ ఎస్పీవో సదస్సుకు వెళ్లిన సందర్భంలో ఆయనను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం నిర్వహించింది. తర్వాత పింగ్ స్వదేశానికి రాగా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు విదేశాల్లో ఉంటున్న పలువురు చైనా జాతీయులు కూడా జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ట్వీట్లు చేశారు. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి జిన్ పింగ్ స్థానంలో పి ఎల్ ఏ జనరల్ గా ఉన్న లీ కుమింగ్ ను చైనా అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు పెట్టారు.” పి ఎల్ ఏ వాహనాలు ఈనెల 22న రాజధాని దిశగా కదిలాయి. బీజింగ్ సమీపంలోని హువాన్ లై కౌంటి నుంచి హెబే ప్రావిన్స్ లోని జెగ్ బే కౌ వరకు ఈ కాన్వాయ్ 80 కిలోమీటర్ల మేర ఉంది. సీసీపీ నాయకత్వం జిన్ పింగ్ ను పి ఎల్ ఎ అధిపతిగా తొలగించిన తర్వాత హౌస్ అరెస్ట్ చేశారంటూ” పలుమార్లు చైనా ప్రభుత్వ నిర్బంధానికి గురైన మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్ చేశారు. ఆమె ట్వీట్ ను ఉటంకిస్తూ చైనా రచయిత గోర్డాన్ చాంగ్ చైనా అస్థిరమవుతోందని విరుచుకు పడ్డారు.
విమానాలనూ నిలిపేశారు
ప్రస్తుతం చైనా దేశంలో ఆరవై శాతం విమానాలను ఏ కారణమూ చూపకుండా నిలిపి వేశారు. మొన్నటిదాకా తనకు ఎదురేలేదని భావించిన జిన్ పింగ్ పరిస్థితి ఆకస్మాత్తుగా ఎందుకు తలకిందులైంది? జీవితకాల అధ్యక్షుడైన ఆయనకు ఉద్వాసన గతి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం కమ్యూనిస్టు పార్టీలో గిట్టని వారిపై పింగ్ కక్ష సాధింపునకు దిగడమే కారణమని తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఇటీవల చైనాలో ఇద్దరు మాజీ మంత్రులను ఉరి తీశారు. నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించారు. వీరంతా కూడా జిన్ పింగ్ కు ప్రత్యర్థులని సమాచారం. మరణశిక్షకు గురైన వారిలో న్యాయశాఖ మాజీ మంత్రి ఫు జెంగ్ హువా, వాంగ్ లైక్ ఉన్నారు. మరికొద్ది వారాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన వ్యతిరేకులను అణచివేసేందుకే జిన్ పింగ్ ఇలా చేశారని భావిస్తున్నారు. ఈ పరిణామాలు అన్నింటి మధ్య పింగ్ ఏకపక్ష ధోరణి సహించలేక సీసీపీ ఆయనను తొలగించిందని వార్తలు వస్తున్నాయి.

ఎస్ పీ వో సదస్సులో ఉన్నప్పుడు
జిన్ పింగ్ ఎస్సీవో సదస్సులో ఉండగా.. తన వ్యతిరేకులు పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించి పదవి నుంచి తప్పించేలా చేశారని చెబుతున్నారు. దీనిపై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందించలేదు. ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ కథనాలను ధ్రువీకరించలేదు. ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఎస్సిఓ సదస్సులో జిన్ పింగ్ ముభావంగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ అసలు ఆయనను పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కనీసం పలకరించలేదు. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలు చెలరేగిన సమయంలో ఇరు దేశాల సైనికులు మరణించారు. అప్పటినుంచి చైనా తీరుపై ఆగ్రహంగా ఉన్న మోదీ.. ఆ దేశానికి చెందిన యాప్ ల పై నిషేధం విధించారు. ఆ దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ప్రస్తుతం ఈడి దాడులు జరుగుతున్నాయి. ఇన్ని పరిణామాల మధ్యలోనే జిన్ పింగ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు రావడం గమనార్హం.