Chinese Foreign Minister Visits India: భారత్‌కు, చైనాకు మొదటి నుంచి వివాదం ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఇండియా, చైనా సైనికుల మధ్య గాల్వాన్‌లో పెద్ద ఎత్తున గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చైనా, భారత్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. లఢక్ సమీపంలో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులను నివారించేందుకు ఇప్పటికే ఇండియా, చైనా సైన్యాధికారులు ఎన్నో సార్లు భేటీ అయినా.. పెద్దగా సక్సెస్ కాలేదు.
అయితే ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇండియాకు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ రావడం సంచలనం రేపుతోంది. ఆయన భారతీయ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో మీటింగ్ అయ్యారు. ఇదే ఇక్కడ ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధ నేపథ్యానికి, వాంగ్ యీ ఇండియా పర్యటనకు ఎక్కడో లింక్ ఉందంటున్నారు విశ్లేషకులు.
Also Read: CM KCR- Governor Tamilisai: కేసీఆర్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేసిన గవర్నర్
వాస్తవానికి ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇండియా, చైనాలు మాత్రం రష్యాకు అనుకూలంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు రష్యాకు మిత్ర దేశాలుగానే మెలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇండియాకు చైనా విదేశాంగ మంత్రి రావడం వెనకాల పుతిన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే బ్రిక్స్ దేశాల సమావేశం చైనాలోని బీజింగ్‌లో జరగనుంది. ఇందులో రష్యా, భారత్, చైనాతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు సభ్యత్వాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశానికి మొదట భారత్ దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చైనా ఓ మెట్టు దిగి మరీ ఇండియాకు తమ విదేశాంగ మంత్రిని పంపించడంతో.. ఇండియా ఆ మీటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ బ్రిక్స్ సమావేశం మన దేశం కన్నా కూడా.. రష్యాకు చాలా అవసరం.
నాటో దళాలు ఇప్పటికే యుక్రెయిన్‌కు సపోర్టు ఇవ్వడానికి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. రష్యా ఈ బ్రిక్స్ దేశాల సాయం కోరే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. మన ఇండియా చైనాతో మిత్ర దేశంగా మెలిగితే.. అది పుతిన్‌కు ఉపయోగపడుతుందని, అందుకే తనకు అత్యంత సన్నిహితమైన చైనాతో ఓ మెట్టు దిగేలా చేసి మరీ.. ఇండియాను కలుపుకుని పోవాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ రష్యా చేసిన పని.. ఇటు ఇండియా అటు చైనా మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్