చైనా సమరోత్సాహంతో ఊగిపోయింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పెట్టి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఊగిపోయారు. తైవాన్ ను ఆక్రమించేస్తామని.. మకావ్ ను తీసుకుంటామని.. అడ్డొస్తే అమెరికా తల పగులుతుంది అని పరోక్షంగా హెచ్చరించారు. చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని ప్రకటించారు.
తైవాన్ ను చైనాలో విలీనం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు. అడ్డొచ్చిన ఏ దేశాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చైనాను లొంగదీసుకోవడం.. బెదిరించడం.. అణిచివేయడం లాంటి ప్రయత్నాలను ఏమాత్రం సహించమని చైనా అధ్యక్షుడు సవాల్ చేశారు.
ఇక ఎవరైనా సరే దుస్సాహసం చేయాలనుకుంటే 140 కోట్ల ప్రజలు సృష్టించిన ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఢీకొని వారి తల పగులుతుంది అని అమెరికాను ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చూస్తుంటే అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి కూడా జిన్ పింగ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. చైనా తాజాగా తైవాన్ ను ఆక్రమించేస్తామం.. హాంకాంగ్, మకావ్ లలో చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.