చైనా యాప్స్ ను భారత్ నిషేధిస్తే.. చైనా ఏం చేసిందంటే?

గాల్వానా లోయలో చైనా-భారత్ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఓవైపు చర్చలంటూనే దొంగదెబ్బతీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారత ఆర్మీ సిద్ధమవుతోంది. ఆసియాలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక చైనా తన దుర్భుద్ధిని చాటుకుంటోంది. ప్రపంచానికి కరోనా అంటించి అందరి ముందు తలదించుకున్న చైనా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ తనలోని రాజ్యకాంక్షను చాటుకుంటోంది. చైనా తనకున్న సైన్యాన్ని చూపించి ప్రపంచాన్ని బెంబేలెత్తించాలని చూస్తోంది. చైనా వైరస్ నుంచి […]

Written By: Neelambaram, Updated On : July 1, 2020 5:23 pm
Follow us on


గాల్వానా లోయలో చైనా-భారత్ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఓవైపు చర్చలంటూనే దొంగదెబ్బతీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారత ఆర్మీ సిద్ధమవుతోంది. ఆసియాలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక చైనా తన దుర్భుద్ధిని చాటుకుంటోంది. ప్రపంచానికి కరోనా అంటించి అందరి ముందు తలదించుకున్న చైనా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ తనలోని రాజ్యకాంక్షను చాటుకుంటోంది. చైనా తనకున్న సైన్యాన్ని చూపించి ప్రపంచాన్ని బెంబేలెత్తించాలని చూస్తోంది. చైనా వైరస్ నుంచి ప్రపంచాన్ని దృష్టిమరల్చేందుకు భారత్ తో యుద్ధానికి సిద్ధమవుతోంది.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

దీనికి భారత్ సైతం ధీటుగానే జవాబిస్తోంది. భారత్ శాంతికాముఖ దేశమని చెబుతూనే తనజోలికొస్తే సహించేది లేదని చైనాకు గట్టి వార్నింగ్ ఇస్తోంది. భారత జవాన్ల మృతితో రగిలిపోతున్న భారత్ ఈసారిగా చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీ అంటోంది. చైనాను రక్షణపరంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. ఈమేరకు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దుచేసింది. తాజాగా చైనాకు చెందిన 59 యాప్స్ ను భారత్ నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!

దీనికి కౌంటర్ గా చైనాకు భారత్ చెందిన పలు వెబ్ సైట్లను బ్యాన్ చేస్తోంది. చైనాకు చెందిన యాప్స్ నిషేధించిన నేపథ్యంలో చైనా ప్రతిచర్యగా ప్రముఖ భారత వెబ్ సైట్లను, మీడియా ఛానళ్లను బ్యాన్ చేస్తున్నట్లు చెబుతోంది. చైనా తనకున్న ఆధునిక టెక్నాలజీతో వీపీఎస్ సర్వీసులు కూడా పని చేయకుండా చేసినట్లు తెలుస్తోంది. కాగా భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ యాజమాన్యం తిరిగి భారత్ ను ఆశ్రయిస్తోంది. టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా-భారత్ ఉద్రిక్తత నేపథ్యంలో ఇప్పట్లో ఈ యాప్స్ కు కేంద్రం అనుమతి లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇరుదేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం లేదు. దీంతో మున్ముందు పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయోననే ఆందోళన అందరిలో నెలకొంది.