https://oktelugu.com/

తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

పార్టీలన్నాక అసమ్మతి సహజం.. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పార్టీపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. వైసీపీలోనూ అది మొదలైంది. ఇసుక కొరతపై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శించారు. ఒకాయన ధర్నా కూడా చేశాడు. తిరుపతి ఎంపీ అయితే వైసీపీ ఏం చేస్తాలేదన్నాడు. ఇక నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అయితే వైసీపీ పై తిరుగుబావుటా ఎగురవేశాడు.. టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత? ఎంపీ రఘురామ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2020 1:25 pm
    Follow us on


    పార్టీలన్నాక అసమ్మతి సహజం.. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పార్టీపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. వైసీపీలోనూ అది మొదలైంది. ఇసుక కొరతపై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శించారు. ఒకాయన ధర్నా కూడా చేశాడు. తిరుపతి ఎంపీ అయితే వైసీపీ ఏం చేస్తాలేదన్నాడు. ఇక నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అయితే వైసీపీ పై తిరుగుబావుటా ఎగురవేశాడు..

    టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

    ఎంపీ రఘురామ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఏపీతోపాటు ఢిల్లీలోనూ వైసీపీ పరువు తీసేలా ఆయన వ్యవహరిస్తున్నారు. మాటల మంటలు రేపుతూ రచ్చ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ లో పార్టీపై విమర్శలు చేసే వారికి దడ పుట్టించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

    అందుకే వైసీపీ అధిష్టానం దీనిపై సీరియస్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని తెలిసింది. అసమ్మతులకు గట్టి షాక్ ఇచ్చేలా ఎంపీ రఘురామకు బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యిందట..

    గతంలో జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పై ఇలానే పార్లమెంట్ లో అనర్హత వేటు పడింది. ఆయన సొంత పార్టీపై అసమ్మతి రాజేసినందుకు ఏకంగా ఎంపీ పదవిని కోల్పోయారు. పార్లమెంట్ లో ఇదో చట్టం కూడా ఉందట.. అదేపద్ధతిలో రఘురామపైన వేటు వేసేందుకు దీన్నే బ్రహ్మాస్త్రంగా వైసీపీ అధిష్టానం తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

    పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!

    ఇందులో భాగంగా ఇలాంటి విషయంలో నైపుణ్యం ఉన్న ఎంపీ బాలశౌరితోపాటు ఇద్దరు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లారని తెలిసింది.రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ వైసీపీ పార్లమెంటరీ నేతలు మాట్లాడాలని డిసైడ్ అయ్యారట..ముందుగా పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత అనర్హత వేటు వేయాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ రఘురామ పోస్టును ఊడగొట్టి ఆయనను జీరోను చేసి మిగతా అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎంపీలకు గట్టి హెచ్చరిక పంపాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.

    అయితే వైసీపీ తనను అనర్హుడిగా చేయాలని చూస్తున్న విషయం తెలిసి.. ఎంపీ రఘురామ కూడా న్యాయనిపుణులతో చర్చిస్తూ కోర్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడట.. ఇలా వైసీపీ అధిష్టానం అసమ్మతుల పీచమణిపించే ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.