ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై వైసీపీ ప్రభుత్వం కేసుల పేరుతో నేరుగా చర్యలకు దిగి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మరి కొందరు టీడీపీ నేతలపై పరోక్షంగా చర్యలకు ప్రభుత్వం దిగింది. మాజీ మంత్రి నారాయణ విద్య సంస్థను దెబ్బతీసే విధంగా ప్రవేటు జూనియర్ కళాశాలపై అడ్మిషన్ల సంఖ్యను సగానికి తగ్గిస్తూ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టార్గెట్ […]

Written By: Neelambaram, Updated On : June 30, 2020 9:02 pm
Follow us on


మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై వైసీపీ ప్రభుత్వం కేసుల పేరుతో నేరుగా చర్యలకు దిగి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మరి కొందరు టీడీపీ నేతలపై పరోక్షంగా చర్యలకు ప్రభుత్వం దిగింది. మాజీ మంత్రి నారాయణ విద్య సంస్థను దెబ్బతీసే విధంగా ప్రవేటు జూనియర్ కళాశాలపై అడ్మిషన్ల సంఖ్యను సగానికి తగ్గిస్తూ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టార్గెట్ చేసింది.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

సీఎం జగన్ ఎంపీ గల్లా జయదేవ్ కు పెద్ద షాక్ ఇచ్చారు. ఎంపీకి చెందిన సంస్థ అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్ కు 253.61 ఎకరాల భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీఐఐసీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమర్ రాజా ఇన్‌ఫ్రాకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలో వివిధ సర్వే నంబర్లలో 483.27 ఎకరాలను కేటాయించింది. ఈ భూమిలో 253.61 ఎకరాలల్లో సంస్థ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

ప్రభుత్వం తన సంస్థలపై చర్యలకు దిగే అవకాశం ఉందని ఎంపీ గల్లా జయదేవ్ కొన్నాళ్ల కిందట వెల్లడించారు. తమ ఆర్థిక మూలలను దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వం ఎంపీకి చెందిన సంస్థకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని అమరావతి సహా వివిధ అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీరుపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం గల్లా కుటుంబం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరింది. ప్రస్తుతం వైసీపీ చర్యపై ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.