Rohit Sharma : మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మీద ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ట్రోఫీ దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా విశాఖపట్నంలో ఓ హోటల్లో సంబరాలు చేసుకుంది. ఈ హోటల్లోనే టీమిండియా ప్లేయర్లు బస చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ జైస్వాల్ సెంచరీ చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీతో శతక భాగస్వామ్యాలు నిర్మించాడు.
మొదట్లో యశస్వి జైస్వాల్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకానొక సందర్భంలో బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. ఎప్పుడైతే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడో
.. ఆ తర్వాత తన గేర్ మార్చాడు . దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తద్వారా వన్డేలో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. యాన్సన్ నుంచి మొదలుపెడితే కేశవ్ మహారాజ్ వరకు ఏ బౌలర్ నూ యశస్వి వదిలిపెట్టలేదు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు.
సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జైస్వాల్ ను విరాట్ కోహ్లీ అభినందనలతో ముంచెత్తాడు. టీమిండియా విజయం సాధించిన తర్వాత ప్లేయర్లు హోటల్ రూమ్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యశస్వి జైస్వాల్ కేక్ ను రోహిత్ శర్మకు తినిపించబోయాడు. దానికి రోహిత్ నిరాకరించాడు. నహీ భాయ్.. మే మోట హో జా ఉంగా వాపస్ ( కేకు వద్దు బ్రదర్. నేను మళ్ళీ లావు అవుతాను) అంటూ రోహిత్ కి ఒక ముక్క తీసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తుంది.
ఈ వీడియో ప్రకారం రోహిత్ శర్మ డైట్ ఎంత కఠినంగా పాటిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 2027వ సంవత్సరంలో వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా రోహిత్ శర్మ అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే తన బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. వికెట్ల మధ్య చిరుత పులి మాదిరిగా పరుగులు పెడుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి శనివారం ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్ వరకు రోహిత్ శర్మ వీరోచితంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలను రోహిత్ శర్మ సాధించాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకున్నాడు.